తెలంగాణ

telangana

కేటీఆర్​కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్.. అది నిరూపిస్తే..?

By

Published : Mar 10, 2023, 1:50 PM IST

Komatireddy RajagopalReddy Tweet: మంత్రి కేటీఆర్​కు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విటర్​ వేదికగా ఛాలెంజ్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. తాను బీజేపీలో చేరడానికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టును తీసుకున్నానని చేస్తున్న ప్రచారాన్ని నిరూపించాలని డిమాండ్​ చేశారు.

komati reddy
komati reddy

Komatireddy RajagopalReddy Tweet: మంత్రి కేటీఆర్​ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ట్విటర్​ వేదికగా సవాల్​ విసిరారు. కేటీఆర్‌కు ఏ మాత్రం విశ్వసనీయత, నిజాయితీ ఉన్నా.. తాను బీజేపీలో చేరినందుకు రూ.18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని నిరూపించాలని డిమాండ్ చేశారు. తన విషయంలో గ్లోబల్స్ ప్రచారం పని చేస్తుందని అనుకోవద్దని ట్విటర్​ ద్వారా కేటీఆర్‌కు హితవు పలికారు.

అయితే గురువారం జరిగిన మీడియా సమావేశంలో​ మునుగోడులో ఒక వ్యక్తికి ఏకంగా రూ.18వేల కోట్ల కాంట్రాక్టును బీజేపీ మూటజెప్పిందని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. ఇన్ని వేలకోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు.. బీజేపీలో చేరగానే వారు సత్యవంతులైపోతారని అన్నారు. వారి మీద ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులు ఉండవని చెప్పారు. వారిలో సుజనాచౌదరి, సీఎం రమేశ్​లు ఆ పార్టీలో చేరగానే వారిపై ఉన్న కేసులు అన్నీ మాయమైపోయాయి ఏంటో ఆ విడ్డూరం తెలియడం లేదని ఆశ్చర్యపోయారు.

'బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థ బీజేపీ మాట వినలేదని.. ఆ సంస్థపై దాడులకు ఊసిగొల్పింది. ఈ 9 సంవత్సరాల్లో బీజేపీ 9 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను నేలకూల్చింది. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5422 ఈడీ కేసులు నమోదయ్యాయి. కచ్చితంగా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని' కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మునుగోడు ఎన్నికలో ఓటమికి కారణం ఈ కాంట్రాక్టే: కాంగ్రెస్​ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉపఎన్నిక తప్పనిసరి అయింది. అయితే రాజగోపాల్ రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు గురించే బీజేపీ పార్టీలో చేరారని బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నేతలు అప్పట్లో తెగ ప్రచారం చేశారు. బీఆర్​ఎస్​ నాయకులు.. విపరీతంగా ఈ విషయంపై ఎన్నికల క్యాంపైన్​లో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ఇదే విషయంపై మునుగోడు నియోజకవర్గం మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు రాజగోపాల్​రెడ్డికి వ్యతిరేకంగా గోడపత్రికలు అంటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయాన్ని కుండగద్దలు కొట్టినట్లు చెప్పేవారు. దీంతో అక్కడ ఆయన ఓటమికి ఇది ప్రధాన కారణమైంది. ఇప్పటి కూడా దానిపై రాష్ట్ర అధికార పక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details