తెలంగాణ

telangana

పేదలందరికీ ప్రగతి ఫలాలు అందే అజెండాతో 'బీఆర్ఎస్'

By

Published : Dec 14, 2022, 8:28 PM IST

KCR Inaugurated Party National Office in Delhi: తెలంగాణ తరహా పాలనను దేశవ్యాప్తంగా అందించడమే లక్ష్యమంటూ.. బీఆర్ఎస్​ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్దార్ పటేల్ రోడ్​లోని బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి.. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామితోపాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలకబోతుందని నాయకులు ఆకాంక్షించారు.

KCR Inaugurated Party National Office in Delhi
KCR Inaugurated Party National Office in Delhi

పేదలందరికీ ప్రగతి ఫలాలు అందే అజెండాతో బీఆర్ఎస్

KCR Inaugurated Party National Office in Delhi: పేదలందరికీ ప్రగతి ఫలాలు అందాలనే అజెండాతో భారత రాజకీయాల్లోకి బీఆర్ఎస్ దిల్లీ వేదికగా ఘనంగా ప్రవేశించింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్​కు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని హస్తినలో పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించారు. జాతీయ రాజకీయాల్లో తన ముద్రను బలంగా వేసేందుకు బీఆర్ఎస్ దిల్లీ నుంచి శ్రీకారం చుట్టింది.

తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే జాతీయ పార్టీని ప్రారంభించినట్లు పేర్కొన్న కేసీఆర్‌, ఆ దిశలో తొలి అడుగు పడిందన్నారు. పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభానికి ముందు రాజశ్యామల, నవచండీ యాగాల్లో సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా పాల్గొన్నారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయాన్ని ప్రారంభించారు.

దీంట్లో సొంత ఎజెండా ఎముంటది. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నాం. వెల్ఫెర్ కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో మిరంతా చూస్తున్నారు. ఈరోజు వాటర్, 24 గంటలు కరెంట్​ కానీ ఇది దేశవ్యాప్తంగా చేయ్యాలి అనే ఆలోచన, మరి చేయడంలో తప్పేముంది. మరి ఈరోజు బీఆర్​ఎస్ కూడా ఏర్పాటు చేస్తే, సరే వచ్చే ఆటంకాలు వస్తాయ్. రాబోయే కాలంలో ఈ దేశానికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి. ఇప్పుడే మా స్లోగన్ ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని పెట్టినాం. మరి రైతంగమే 70 శాతం ఉన్నటువంటి రైతుల కోసం చేయవల్సిన పని, ఈ 75 సంవత్సరాల స్వాతంత్యంలో జరుగుతల్లేదు మనందరికి తెలుసు డెఫినేట్​గా చూస్తారు. తలసాని శ్రీనివాస్​యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి

సర్దార్ పటేల్ రోడ్​లోని బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామితోపాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు, రైతుసంఘం నేతలు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్ఎస్ పురుడుపోసుకుందని నాయకులు చెప్పారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ఫొటోలు, పార్టీ నినాదాలతో సర్దార్ పటేల్ రోడ్డులో పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్, తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసం, ఎంపీల నివాసాల వద్ద భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details