తెలంగాణ

telangana

panchayat secretaries strike : 'భయపెట్టాలని చూస్తే.. సమ్మె మరింత ఉద్ధృతం చేస్తాం'

By

Published : May 9, 2023, 10:45 PM IST

Junior panchayat secretaries strike : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినా.. కార్యదర్శులు వెనక్కు తగ్గలేదు. తమను రెగ్యులర్‌ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా 12వ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా న్యాయం జరిగే వరకు సమ్మె కొనసాగింపులో తాము తీసుకున్న నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తే.. పోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

panchayat
panchayat

Junior panchayat secretaries strike

Junior panchayat secretaries strike : రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరకపోతే.. ఉద్యోగంలోంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరింది. అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె కొనసాగిస్తున్నారు. కార్యదర్శులకు ప్రభుత్వం తుది గడువు విధించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని అమరవీరల స్థూపం ముందు తెలంగాణ పంచాయతీ ఫెడరేషన్‌ నిరసనకు దిగింది.

తమను భయపెట్టాలని చూస్తే పోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం పిలిస్తే.. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న కార్యదర్శులు.. తమకు సంబంధించిన రెగ్యులరైజేషన్‌ జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో... కార్యదర్శులు సమ్మెలో పాల్గొన్నారు. మూడేళ్ల సర్వీస్‌ అనంతరం తమను రెగ్యులర్‌ చేస్తామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు.

"గత నాలుగేళ్ల మా పనికి నిదర్శనం రాష్ట్రానికి 73 పంచాయతీ అవార్డులు వచ్చాయి. ఇంకా బాగా పని చేస్తాం. మమ్మల్ని రైగ్యూలరైజ్​ చేయడి. ప్రభుత్వంతో చర్ఛలకు మేము సిద్దంగా ఉన్నాం. మా తోటి ఉద్యోగస్థులను కోల్పాయం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మీరు ఉద్యమంతో తెలంగాణ సంపాదించుకున్నారు. మేము కూడా అదే దారి ఎంచుకున్నాం. మా డిమాండ్​లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు. ఉద్యోగాలు క్రమబద్దీకరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. రెగ్యులర్‌ చేసి 9,355 కుటుంబాల్లో వెలుగులు నింపాలి."- జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు

Demands of Junior Panchayat Secretaries : తాము ఉద్యోగంలో చేరి నాలుగేళ్లవుతున్నా ఇంకా రెగ్యులర్‌ చేయలేదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలనే ఆవేదనే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమను రెగ్యులర్‌ చేయాలని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కోరారు. 9వేల 355కుటుంబాల్లో వెలుగులు నింపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

"ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఎంతో పోటిని తట్టుకొని మరి ఈ ఉద్యోగంలో చేరాం. ఇప్పుడు మాపై ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోంది. ఎన్నో అవార్డులను తీసుకొచ్చాం. దయచేసి మా ఉద్యోగాలను క్రమబద్దీకరించండి."-మహిళ పంచాయతీ కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details