తెలంగాణ

telangana

నేటి నుంచి గన్నవరం ఎయిర్​పోర్టులో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

By

Published : Oct 31, 2022, 12:07 PM IST

Gannavaram Airport: విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా వేచి చూస్తున్న గన్నవరం విమానశ్రయంలో అతర్జాతీయ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని వంశీ అధికారంగా ప్రకటించారు. ఎయిర్​ ఇండియా అధికారులతో అనేక చర్చలు అనంతరం మార్గం సులభతరమైందని ఆయన అన్నారు.

Gannavaram Airport
Gannavaram Airport

Gannavaram Airport: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానయాన సేవలు నేడు ప్రారంభమవుతాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. విమానయాన శాఖ మంత్రి, ఎయిర్ ఇండియా అధికారులతో అనేకసార్లు ఈ విషయమై దిల్లీలో చర్చించిన తర్వాత అనుమతులు లభించాయన్నారు. ఎయిర్ ఇండియా వారిచే విజయవాడ నుంచి షార్జాకు వారంలో రెండు రోజులు పాటు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం, శనివారం రాత్రి 9.05 గంటలకు విమానం బయలు దేరుతుందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం తొలిసారిగా విజయవాడ వచ్చి షార్జాకు ప్రయాణీకులను తీసుకెళ్లనుందని అన్నారు. అలాగే విజయవాడ నుంచి మస్కట్​కు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు, విజయవాడ నుంచి కువైట్​కు ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విమానాలు నడుపుతారని తెలిపారు.

నేటి సాయంత్రం విజయవాడ విమానాశ్రయానికి మొదటిసారిగా వస్తున్న షార్జా విమానానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి స్వాగతం పలుకుతారు. అలాగే షార్జాకు వెళ్లే ప్రయాణీకులకు బోర్డింగ్ పాసులను అందచేస్తారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details