తెలంగాణ

telangana

Ganesh Immersion in HYD: తుది దశకు చేరుకున్న గణేశ్​ నిమజ్జనోత్సవం

By

Published : Sep 20, 2021, 9:55 AM IST

Updated : Sep 20, 2021, 12:52 PM IST

Ganesh Immersion in HYD: ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం పూర్తి.. రాకపోకలు పునరుద్ధరణ
Ganesh Immersion in HYD: ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం పూర్తి.. రాకపోకలు పునరుద్ధరణ

హైదరాబాద్‌ (Hyderabad) మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవం (ganesh immersion) తుది దశకు చేరుకుంది. వినాయక విగ్రహాలను భక్తులు పెద్దఎత్తున ఊరేగింపు మధ్య ట్యాంక్‌బండ్‌ (tankbund)కు తరలిస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనం (ganesh immersion) చివరి దశకు చేరుకుంది. వేల సంఖ్యలో వినాయక ప్రతిమలు ఉండటంతో పాటు వర్షం కారణంగా నిన్న ప్రారంభమైన నిమజ్జనం కొంత ఆలస్యమైంది. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనం పూర్తైంది. ఎన్టీఆర్ మార్గ్‌లో వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు రాకపోకలకు పోలీసులు అనుమతించారు. ఒకవైపు రాకపోకలకు అనుమతిస్తున్నారు.

Ganesh Immersion in HYD: ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనం పూర్తి

అయితే పీవీ మార్గ్‌లో వినాయక విగ్రహాలు ఇంకా బారులుతీరే ఉన్నాయి. ఈ విగ్రహాలను ఎన్టీఆర్ పార్క్​, ఘాట్, లేపాక్షి సమీపంలోకి తరలిస్తూ.. అక్కడ నిమజ్జనం చేయిస్తున్నారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలను ఖైరతాబాద్ వంతెన నుంచి పంపిస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గం వైపు వాహనాలను అనుమతించడం లేదు. మధ్యాహ్నానికి గణేశ్​ నిమజ్జనం పూర్తి కానుంది. అప్పటి వరకు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, పీవీ మార్గ్​లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద 1 క్రేన్ సాయంతో విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది.

రాకపోకలు పునరుద్ధరణ..

ఇప్పటి వరకు 4 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తి కాగా.. మరికొద్దిసేపట్లో నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పునరుద్ధరించారు. ట్యాంక్​బండ్​పై రెండు వైపులా రాకపోకలు పునరుద్ధరించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.

ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగుతల్లి పైవంతెన వైపు రాకపోకలు పునరుద్ధరించాం. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు కూడా రాకపోకలకు అనుమతించాం. పీవీ మార్గ్‌లో మాత్రమే విగ్రహాల నిమజ్జనం సాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటలోగా పీవీ మార్గ్ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం. మిగిలిన అన్ని మార్గాల్లో యథావిధిగా రాకపోకలు సాగించవచ్చు: అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ

చెత్త తొలగింపు..

హుస్సేన్​సాగర్​లో ఓ పక్క గణేశ్​ నిమజ్జనం కొనసాగుతుండగా.. మరోపక్క వ్యర్థాలు, చెత్త తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ట్యాంక్​బండ్​లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. గణేశ్​ విగ్రహాల తయారీలో ఉపయోగించిన ఇనుప చువ్వలను రెండు క్లీనింగ్ మిషన్​ల ద్వారా శుభ్రం చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తను జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు పరిశుభ్రం చేయడంతో పాటు గణేశ్​ విగ్రహాలను సాగర్​లో నుంచి బయటకు తీస్తున్నారు.

BALAPUR LADDU: 'బాలాపూర్​ లడ్డూ' వేలంపాట.. మొదటి నుంచి ఇప్పటిదాకా..!

Last Updated :Sep 20, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details