తెలంగాణ

telangana

Dual Degree Programmes at IIIT Hyderabad : ఆర్ట్స్ కోర్సులు చేసినా ఇంజినీరింగ్ ఛాన్స్.. కాకపోతే కొన్ని షరతులు

By

Published : May 28, 2023, 12:51 PM IST

Dual Degree Programmes at IIIT Hyderabad : ట్రిపుల్ ఐటీ హైదరాబాద్.. ఇంటర్​లో ఆర్ట్స్ గ్రూపులు తీసుకుని ఇంజినీరింగ్ వైపు రాలేకపోతున్నవారికి శుభవార్త చెప్పింది. ఇక నుంచి కేవలం గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలు చదివిన వారికే కాదు.. హెచ్​ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది. అలాగే డిగ్రీ కోర్సులను కల్పిస్తూ విద్యార్థులు ప్రతిభావంతులు అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది.

IIIT Hyderabad
IIIT Hyderabad

Arts Students to study engineering : నేటి టెక్నాలజీ యుగంలో మారుతున్న సాంకేతికతకు తోడు విద్యార్థుల నైపుణ్యాలు అంతే స్థాయిలో మెరుగుపడితేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమకు ఇంటర్​లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీపై అంత అవగాహన లేకపోవడంతో ఆర్ట్స్ కోర్సులు తీసుకుంటున్నారు. తదుపరి కాలంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కొంత పరిజ్ఞానం సాధించిన విద్యార్థులు టెక్నాలజీ వైపు వెళ్దామనుకుంటున్నారు. కానీ తమకి ఇంజినీరింగ్ చేసే అవకాశం లేకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గుడ్ న్యూస్ చెప్పింది.

దాంతో గణిత, భౌతిక, రసాయనశాస్త్రాలు చదివిన వారికే కాదు.. హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ అభ్యసించేందుకు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తో పాటు కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్స్‌ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్‌ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుందని ట్రిపుల్‌ఐటీ సంచాలకులు ప్రొఫెసర్‌ పీజే నారాయణన్‌ శనివారం తెలిపారు. ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

TS Engineering counseling schedule 2023 : ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ఇంటర్మీడియట్‌(ప్లస్‌టూ)లో గణితశాస్త్రం పూర్తి చేసిన వారు 90శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. దరఖాస్తుదారుల్లో అత్యధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ నేరుగా ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తామని చెప్పారు. విద్యార్థులు సంప్రదాయ కోర్సుల సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే సైన్స్‌ కాకుండా హ్యూమనిటీస్‌ గ్రూప్‌లు చదివిన విద్యార్థులు డ్యూయల్‌ డిగ్రీ కోర్సులకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. గతేడాది దరఖాస్తు చేసుకున్న 20 వేల మందిలో 2 వేల మంది హ్యూమనిటీస్‌ను ఎంచుకున్నారని వివరించారు.

నేటి ఆధునిక కాలంలో ఇంజినీరింగ్‌ విద్య ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నస్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవడంలో ఇంజినీరింగ్‌ విద్యే మెరుగైన పాత్ర పోషిస్తోంది. అయితే కొందరు విద్యార్థులు చెడుస్నేహాలు, వ్యసనాలు, ఆన్‌లైన్‌ క్రీడలు, డ్రగ్స్‌, బెట్టింగులతో తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం చూస్తున్నాం. వీరి తప్పులతో ఏ మాత్రం సంబంధం లేని తల్లిదండ్రులు దోషుల్లా సమాజంలో నిలబడాల్సివస్తోంది. అందువల్ల ఏ పని చేయాలన్నా.. ఒకసారి మీ అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, బంధువులు, గౌరవించే, ప్రేమించే వ్యక్తులు.. వీరందరినీ గుర్తుకు తెచ్చుకోండి. తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేస్తే సంతోషమే. అలా చేయడం వీలుకాకపోయినా వారిని తల దించుకునేలా మాత్రం చేయకూడదని గుర్తుంచుకోవాలి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details