తెలంగాణ

telangana

పాదాలు మృదువుగా కావాలంటే... ఇలా చేయండి!

By

Published : Jul 4, 2020, 8:55 AM IST

జట్టుకు పోషణనిచ్చే కండిషనర్​తో ఇతరత్రా ప్రయోజనాలు కూడా పొందొచ్చు అవి ఏంటంటే... రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు పగిలిన పాదాలకు కాసింత కండిషనర్​ రాసి మృదువుగా మర్దనా చేయాలి. ఆపై సాక్సులు వేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలకు తగినంత తేమ, పోషణ అంది మృదువుగా మారతాయి.

If you want the feet to be soft use Hair Conditioners
పాదాలు మృదువుగా కావాలంటే... ఇలా చేయండి!

గోళ్లకూ

హెయిర్​ కండిషనర్​లో పోషణనిచ్చే సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. గోళ్లకు నూనెతో మర్దనా చేసుకునేవారు ఈసారి కాస్త కండిషనర్​ను రాసి మర్దన చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయండి. మృదువైన గోళ్లు మీ సొంతమవుతాయి.

స్క్రబ్​లా

ఈ హెయిర్​ కండిషనర్​ను బాడీ స్క్రబ్​లానూ వాడొచ్చు. పావు కప్పు బ్రౌన్​ షుగర్​లో కొద్దిగా కండిషనర్​, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ, చేతులకు రాసుకొని మృదువుగా మర్దనా చేసుకోవాలి. బ్రౌన్​ షుగర్​ శరీరంపై ఉండే మృతకణాలను తొలగిస్తే... నిమ్మరసం మురికిని పోగుడుతుంది. అలాగే కండిషనర్​ చర్మానికి పోషణను అందించి మృదువుగా ఉంచుతుంది.

ABOUT THE AUTHOR

...view details