తెలంగాణ

telangana

Hyderabad Woman Missing in Nala : హైదరాబాద్‌ గాంధీనగర్‌లో గల్లంతైన మహిళ కోసం కొనసాగుతున్న గాలింపు

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 3:09 PM IST

Updated : Sep 4, 2023, 5:34 PM IST

Hyderabad Woman Missing in Nala : హైదరాబాద్ గాంధీనగర్‌ నాలాలో.. ఆదివారం గల్లంతైనట్లు భావిస్తున్న లక్ష్మి అనే మహిళ కోసం అధికారులు ముమ్మురంగా గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు

rain lashes in hyderabad
woma missing Nala in Hyderabad

Hyderabad Woman Missing in Nala : హైదరాబాద్ గాంధీనగర్‌లోని నాలాలో.. ఆదివారం గల్లంతు అయినట్లు (Hyderabad Woman Missing in Nala) అనుమానిస్తున్న లక్ష్మి అనే మహిళ కోసం.. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. గల్లంతైనట్లు భావిస్తున్న పరిసర ప్రాంతాల నుంచి సుమారు పది కిలోమీటర్ల మేర హుస్సేన్‌సాగర్ సర్ప్రైస్ నాలా, మూసీలో, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి మహిళా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Missing: ఉత్తరాఖండ్‌లో నదిలో పడిన పర్యాటకుల వాహనం.. తెలుగు వ్యక్తి గల్లంతు

మరోవైపు 24 గంటలైనా అధికారులు లక్ష్మి ఆచూకీని గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ తల్లిని గుర్తించడంలో జరుగుతున్న జాప్యంపై.. ఆమె కుమార్తెలు సునీత, సుజాత, సుకన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంలో జరిగిన ఆలస్యం కారణంగానే ఈ ఘటనచోటుచేసుకుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

"ఆదివారం మధ్యాహ్నం నుంచి మా అమ్మ కనిపించడంలేదు. ఏమైందోఅని భయంగా ఉంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా అమ్మ అచూకీ గుర్తించాలని కోరుతున్నాం." - లక్ష్మి, కుమార్తెలు

ఈ నేపథ్యంలోనే గాలింపును తీవ్రతరం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దామోదర సంజీవయ్య నగర్ నుంచి నాగోల్ వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు గాంధీనగర్ డివిజన్ ఏసీపీ రవికుమార్ తెలిపారు. అయితే సదరు మహిళ ప్రవహిస్తున్న నాలాలో గల్లతైందో.. లేదో అని అనుమానంగా ఉన్నట్లు ఏసీపీ రవికుమార్ వివరించారు.

"లక్ష్మి అనే మహిళ కనబడటం లేదని ఆమె కుమార్తెలు ఫిర్యాదు చేశారు. వారి ఇంటికి అనుకుని పక్కనే నాలా ఉంది. దీనిపై విచారణ జరుపుతున్నాం. పక్కనే నాలా ఉండటంతో అందులో పడి గల్లంతయినట్లు అనుమానిస్తున్నాం. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నాం." - రవికుమార్, గాంధీనగర్ డివిజన్ ఏసీపీ

Girl falls in nala in Hyderabad :ఇటీవలే సికింద్రాబాద్‌లో కురిసిన వర్షానికి నాలాలో పడి.. 11 సంవత్సరాల మౌనిక అనే చిన్నారి ప్రాణాలు విడిచింది. కళాసిగూడలో నివాసం ఉండే.. శ్రీనివాస్‌, రేణుక దంపతుల కుమార్తె మౌనిక.. తన సోదరుడితో కలిసి ప్రతిరోజూలాగే పాల ప్యాకెట్‌ కొని తెచ్చేందుకు వెళ్లింది. అయితే భారీ వర్షం కురవడంతో ఇంటి సమీపంలో నీరు రోడ్డుపై నిలిచింది. పక్కనే నాలాపై కప్పుపై రంధ్రం ఏర్పడింది. దీనిని గమనించని మౌనిక నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి అన్న.. ఈ విషయాన్ని పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు చెప్పాడు.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులు స్థానికులతో కలిసి ఆ ప్రాంతంలో గాలించారు. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందిచగా డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి గాలింపు చర్యలు చేపట్టాయి. సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న నాలాలో చిన్నారి మృతదేహం బయటపడింది. అయితే ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో సోదరుడు కిందపడిపోతే... చెల్లి మౌనిక పైకి లేపింది. మళ్లీ ఇద్దరూ నడుస్తుండగా ఒక్కసారిగా చిన్నారి నాలాలో పడి కొట్టుకుపోయి మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Heavy Rains in Telangana Today : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

Live Video : అయ్యో.. ఎంత పనైపాయే.. చూస్తుండగానే కొట్టుకుపోయే

Last Updated : Sep 4, 2023, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details