తెలంగాణ

telangana

Hyderabad Floods 2023 : హైదరాబాద్​పై వర్షం ఎఫెక్ట్.. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు కాలనీలు

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 2:02 PM IST

Hyderabad Floods 2023 : హైదరాబాద్​లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాల్లో అధికారులు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. వరద నీటితో నిలిపి వేసిన మార్గాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. రెండ్రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్న కాలనీలు ఇప్పుడిప్పుడే నీటి నుంచి బయటపడతున్నాయి.

Hyderabad Floods 2023
Hyderabad Heavy Rains

Hyderabad Rains హైదరాబాద్​లో కాస్త తగ్గిన వర్షాలు

Hyderabad Floods 2023 :హైదరాబాద్​లో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. వరద నీటితో అతలాకుతలమయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు మొదలయ్యాయి. భాగ్యనగరంలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల పలు చోట్ల రోడ్లు, జనావాసాలు జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల చెరువులు, వాగులు, కాలువలు, నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి. వాటి కారణంగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

Hyderabad Rains Today 2023 : నగరంలోని చాదర్‌ఘాట్ వంతెన(Chaderghat Bridge) మీదుగా రాకపోకలను ఇప్పటికే పునరుద్ధరించారు. వంతెన మీదుగా రాకపోకలు సాగించాలని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. వాహనాల రద్దీ దృష్ట్యా సుమారు ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు బారికేడ్లను తొలగించారు. వంతెన కింద నుంచి వరద ప్రవాహం ఉండంతో ప్రస్తుతం ముప్పు లేదని చెప్పారు. మరోవైపు నగరంలో వరద నీటి వల్ల బురదమయమైన రహదారులు.. నిలిచిపోయిన నిల్వ నీరు.. తెగిపోయిన కాల్వగట్టులు.. ఇతర పనులను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి.. పునరుద్ధరిస్తున్నారు.

How Much Rainfall Recorded in Greater Hyderabad : హైదరాబాద్​లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు.. ఏ ప్రాంతంలో ఎంత?

Hyderabad Rains in September 2023: భారీ వర్షానికి నీట మునిగిన హైదరాబాద్ నగరంలో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్ పెద్ద గణేశ్(Khairtabad Ganesh) ఎదురుగా ఉన్న ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్​లో.. వర్షానికి కాలనీల్లో భారీగా నీరుచేరింది. గత మూడు రోజులుగా కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో.. స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని.. స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు నిల్వకుండా త్వరలో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. ఆచరణలో కనిపించలేదని వాపోయారు. తాము అనుభవిస్తున్న బాధకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

Hyderabad News Today : ఇవాళ మూసారాంబాగ్​ నాలాలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే ఈనెల 3వ తేదీన ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్​కు ఆనుకుని ఉన్న నాలాలో పడిపోయిన లక్ష్మీగా పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాలా పనులు త్వరగా పూర్తిచేసి.. మరొకరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని ఆమె కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. కాలకృత్యాలు నిమిత్తం వచ్చిన తన తల్లి.. కాలుజారి ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిందని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరారు.

Telangana Weather News Today : అలర్ట్‌.. అలర్ట్‌.. అలర్ట్‌.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. బీ కేర్​ఫుల్

Rain Effect in Hyderabad : దంచికొట్టిన వర్షం.. వణికిపోయిన భాగ్యనగరం.. జనజీవనం అస్తవ్యస్తం

Heavy Rains in Hyderabad Today : భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం.. మూసారంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

ABOUT THE AUTHOR

...view details