తెలంగాణ

telangana

Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు

By

Published : Jun 27, 2023, 10:18 AM IST

Hyderabad Cyber Crimes : నేరాలకు పాల్పడుతున్న రెండు సైబర్‌ ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్​బీఐ కస్టమర్‌ కేర్‌ పేరిట మోసం చేస్తున్న ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. దరఖాస్తుదారులకు తెలియకుండానే.. వ్యక్తిగత రుణాలు తీసుకొని రూ.20 కోట్ల నష్టాన్ని కలిగించిన పదిమంది సభ్యుల ముఠాను పట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat

సైబర్​ కేటుగాళ్ల అంతుపట్టిన పోలీసులు

Cyber Crime Gangs Arrested in Hyderabad : రాష్ట్రంలో సైబర్​ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో కొత్త పద్ధతులతో ప్రజల డబ్బును దోచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కోట్లల్లో ప్రజల డబ్బులను దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. తాజాగా ఎస్​బీఐ పేరిట ప్రజల ధనాన్ని దోచుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

నేరాలకు పాల్పడుతున్న రెండు సైబర్‌ ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్​బీఐ మకస్టమర్‌ కేర్‌ పేరిట మోసం చేస్తున్న ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. దరఖాస్తుదారులకు తెలియకుండానే.. వ్యక్తిగత రుణాలు తీసుకొని రూ.20 కోట్ల నష్టాన్ని కలిగించిన పదిమంది సభ్యుల ముఠాను పట్టుకున్నారు.

Hyderabad Cyber Crimes :సైబరాబాద్ పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో.. రెండు ముఠాలను అరెస్ట్ చేశారు. గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు ఉంచి ఎస్​బీఐ క్రెడిట్ కార్డు కోసం సంప్రదించిన వారిని.. కస్టమర్ కేర్ ప్రతినిధులమని బురిడీకొట్టించి దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న ఘరానా సైబర్‌ నేరగాళ్ల ముఠా.. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు చిక్కింది. క్రెడిట్‌కార్డు వినియోగదారుల నుంచి కొట్టేసిన డబ్బుతో.. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసి.. వాటిని తిరిగి 55 శాతం ధరకు విక్రయిస్తూ ఆముఠా సొమ్ము చేసుకుంటోంది.

కొన్నేళ్లుగా మోసాలు చేస్తున్న ఆ గ్యాంగ్‌పై రాష్ట్రంలో 187 కేసులుండగా..దేశవ్యాప్తంగా 1,502 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులను.. దిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆముఠా గత ఏప్రిల్‌లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఓ ఖాతాదారు నుంచి 15వేల 845 కొట్టేసింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తుచేసిన పోలీసులకు ముఠా చిక్కింది.

డబ్బుకోసం ఓ ముఠా ఏకంగా బ్యాంకునే ముంచింది. బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపి.. వివిధ సంస్థల మాజీ ఉద్యోగుల పేర్లతో దాదాపు 20కోట్లు కొట్టేసింది. 11 మందితో కూడిన ఆముఠా పథకంప్రకారం 61 మంది పేర్లతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసి... సొమ్ము కాజేసింది. రుణం తీసుకున్న వారు నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది తనిఖీ చేయించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు బండారం బయటపడింది. ఆ కేసులో సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. 10 మందిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఆ మోసంలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, వ్యక్తిగత రుణాల దరఖాస్తు పరిశీలించే ఉద్యోగి ఉన్నారని పోలీసులు తెలిపారు. వచ్చిన సొమ్ములో అంతా వాటాలు తీసుకున్నారని నిర్ధరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details