తెలంగాణ

telangana

husband killed his wife out of lust : కోరిక తీర్చడం లేదని... బాలింతని చంపిన భర్త

By

Published : Jun 1, 2023, 5:53 PM IST

Brutal incident in Hyderabad : హైదరాబాద్ పాతబస్తీ పరిధి సైదాబాద్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో బాలింతని కూడా చూడకుండా భార్యపై కామవాంఛ తీర్చుకోవడానికి అమానుషంగా ప్రవర్తించాడు. అడ్డు చెప్పడంతో ముక్కు, గొంతు అదిమి పట్టి కామవాంఛ తీర్చుకున్నాడు. ఊపిరాడక ఆ బాలింత చనిపోయింది.

hyd
hyd

Husband killed wife in oldcity Saidabad : హైదరాబాద్ పాతబస్తీ పరిధి సైదాబాద్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో కామం వెర్రి తలెకెక్కింది. బాలింతని కూడా చూడకుండా భార్య కామవాంఛ తీర్చుకోవడానికి అమానుషంగా ప్రవర్తించాడు. అడ్డు చెప్పడంతో ముక్కు గొంతు అదిమి పట్టి కామవాంఛ తీర్చుకున్నాడు. ఊపిరాడక ఆ బాలింత తనువు చాలించింది. అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. పోస్టుమార్టం నివేదికలో బాలింతది హత్యగా తేలింది. పోలీసులు భర్తను విచారించగా చనిపోతుందని అనుకోలేదన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అగ్రహారం తండాకు చెందిన 24ఏళ్ల జటావత్‌ తరుణ్‌ ఇరవై సంవత్సరాల వయస్సున్న జ్యోత్స్నను ప్రేమించి పెద్దల అంగీకారంతో మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఈ దంపతులు జీవనోపాధి కోసం నగరానికి రాగా తరుణ్ ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో జ్యోత్స్న గత నెలలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మే 20వ తేదీన జ్యోత్స్న అనుమానాస్పదంగా స్థితిలో మృతి చెందింది. అనారోగ్యంతో తన భార్య మృతి చెందిందని తరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న బుధవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో జ్యోత్స్సది హత్యగా నిర్ధరణ అయింది.

Woman Murder Case: వివాహిత హత్య కేసులో బయటపడిన నిజం.. ఆమెను మట్టుపెట్టింది అతనే

Post mortem report reveal the incident : ఆమె భర్త తరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యతో తరుణ్‌ తన కోరికను వెల్లడించారు. నీరసంగా ఉందంటూ ఆమె నిరాకరించినా వినిపించుకోకుండా భర్త బలవంతం చేస్తుండటంతో ఆమె బిగ్గరగా కేకలు వేసేందుకు ప్రయత్నించింది. దీంతో తరుణ్‌ తన కుడిచేతితో ఆమె తలను మంచంపై అదిమి పెట్టాడు. ముక్కు, నోటి మీద అరచేతిని కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు శ్వాస ఆడలేదు. ఈ క్రమంలో నోటిలో నుంచి నురగలు వచ్చి అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను హాస్పిటల్ తీసుకొని వెళ్లిన తరుణ్... అనారోగ్యానికి గురైందని చెప్పాడు. అప్పటికే జ్యోత్స్న చనిపోయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం పోస్టుమార్టమ్ నివేదిక రాగానే తరుణ్​ను అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి

Husband Killed Wife in Hyderabad : క్షణికావేశం.. పది రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు

Doctor killed Wife in Shankarpally : భార్యను చంపి 'డాక్టర్ బాబు' ఆత్మహత్య.. పిల్లలనూ చంపేందుకు..

ABOUT THE AUTHOR

...view details