తెలంగాణ

telangana

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు పోటెత్తిన మామిడి

By

Published : Apr 22, 2020, 6:13 PM IST

ఇవాళ అర్ధరాత్రి నుంచి 3 రోజుల పాటు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు సెలవు ప్రకటించడం వల్ల మార్కెట్‌కు మామిడి పోటెత్తింది.

huge mangoes to the gaddiannaram fruit market
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు పోటెత్తిన మామిడి

కరోనా నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి 3 రోజుల పాటు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు మామిడి పోటెత్తింది. తెలుగు రాష్టాల నుంచి సుమారు 1600 టన్నుల మేర మామిడిని విక్రయం కోసం తీసుకొచ్చారు. ఫలితంగా మార్కెట్ ప్రాంగణంలో రద్దీ నెలకొంది. మరోవైపు ఈ అర్ధరాత్రిలోగా కొనుగోళ్లు పూర్తి చేసేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది.

రేపటి నుంచి 3 రోజుల పాటు ఎవరూ గడ్డిఅన్నారం మార్కెట్‌కు మామిడి తీసుకురావొద్దని అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్‌నర్సింహ గౌడ్ పేర్కొన్నారు. ఒకవేళ తెచ్చినా కొనుగోళ్లు ఉండవని తెలిపారు. 27 నుంచి మామిడిని కోహెడకే తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఈనెల 27 నుంచి కోహెడలో మామిడి విక్రయాలను మార్కెట్ కమిటీ ప్రారంభించనుంది. ఈ మేరకు తాత్కాలిక మార్కెట్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

ఇదీ చదవండి:12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details