ETV Bharat / state

త్వరలోనే విద్యా కమిషన్ - సింగిల్​ టీచర్​ బడులను మూసివేయం : సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth congratulated Students

CM Revanth Attend in 10th Class Felicitation Program : ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం, ప్రభుత్వానికి గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యార్థులు పోటీపడటం ప్రభుత్వ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. త్వరలోనే విద్యా, వ్యవసాయం కమిషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ఏర్పాటుతో ఆయా రంగాల అవసరాలను తక్షణమే పరిష్కరించే వెలుసుబాటు ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

CM Revanth Felicitated 10th Class Toppers with Talent Awards
CM Revanth Attend in 10th Class Felicitation Program (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 4:35 PM IST

Updated : Jun 10, 2024, 7:39 PM IST

త్వరలోనే విద్యా కమిషన్ - సింగిల్​ టీచర్​ బడులను మూసివేయడానికి వీల్లేదు : సీఎం రేవంత్​రెడ్డి (ETV Bharat)

CM Revanth Felicitated 10th Class Toppers with Talent Awards : ఏక ఉపాధ్యాయ పాఠశాలలను మూసివేయవద్దని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మట్టిలో మాణిక్యాలుగా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని సర్కార్​ స్కూల్లో చదువుతోన్న విద్యార్థులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పదో తరగతి టాపర్ల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళా సంఘాలకు మధ్యాహ్న భోజన పథకం బాధ్యత : శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించాం అన్నారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారే అని, ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబునాయుడు, తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చాం, దాని ద్వారా త్వరలో 11వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాం. రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలి. పిల్లలను సర్కార్​ బడుల్లో చేర్పించకపోతే, పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలి."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

ఇకపై విద్యా కమిషన్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ మారుస్తాం : త్వరలోనే విద్య, వ్యవసాయ కమిషన్​లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై నిరంతరం పరిశీలన ఉంటుందన్నారు.

ఇక వ్యవసాయ కమిషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు, నకిలీ విత్తనాలపై కొరడా, వ్యవసాయదారులకు సూచనలు, సలహాలు అందించే వెసులుబాటు ఉంటుందన్నారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. పదవతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్​లో రాణించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండ ఉండాలంటే, తక్షణమే మెగా డీఎస్సీ వేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకే మెగా డీఎస్సీతో 11వేల నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.

తెలుగు కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విషెస్ - విభజన చట్టం అమలుకు కృషి చేయాలని రిక్వెస్ట్ - CM REVANTH WISHES TO TELUGU UNION MINISTERS

మూడు జోన్లుగా తెలంగాణ విభజన - త్వరలోనే అభివృద్ధి ప్రణాళిక : సీఎం రేవంత్ - TELANGANA DIVIDES INTO 3 ZONES

Last Updated : Jun 10, 2024, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.