తెలంగాణ

telangana

ఈడీ కేసుపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

By

Published : Dec 28, 2022, 1:03 PM IST

Updated : Dec 28, 2022, 2:28 PM IST

ఈడీ కేసుపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు
ఈడీ కేసుపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు

13:02 December 28

రోహిత్‌రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు.. విచారణను జనవరి 5కు హైకోర్టు వాయిదా

ఈడీ కేసుపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ కేసు కొట్టివేయాలన్న రోహిత్​రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రోహిత్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి పార్టీ మారాలని వందకోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదని అన్నారు.

నగదు లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని వాదించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని రోహిత్‌రెడ్డి న్యాయవాది వాదనలు వినిపించారు. రోహిత్‌రెడ్డిని విచారణకు ఎప్పుడు పిలిచారని ఈడీని కోర్టు ప్రశ్నించగా, ఈ నెల 30న విచారణకు హాజరవ్వాలని తెలిపామని ఈడీ వివరించింది. అనంతరం ఈ కేసు విచారణ జనవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details