తెలంగాణ

telangana

High Court on MLC Dande Vithal : ఎమ్మెల్సీ దండే విఠల్​ ఎన్నిక వివాదంలో కీలక మలుపు.. కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి సంతకాల పత్రాలు

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 9:52 AM IST

High Court on MLC Dande Vithal : ఆదిలాబాద్​ బీఆర్​ఎస్​ అభ్యర్థిగా 2022లో ఎమ్మెల్సీగా గెలిచిన దండే విఠల్​ ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్​ ఉపసంహరణ పత్రాలపై సంతకాలను తేల్చేందుకు కేంద్ర ఫోరెన్సిక్​ సైన్స్​ లేబొరేటరీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది.

High Court on MLA Satish Kumar
High Court on Adilabad MLC Dande Vithal

High Court on MLC Dande Vithal : ఎమ్మెల్సీ దండే విఠల్(Dande Vithal) ఎన్నిక వివాదం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలను తేల్చేందుకు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా 2022లో దండే విఠల్ గెలిచారు. అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి 2022లోనే హైకోర్టును ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఫోర్జరీ పత్రాలని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని కోరారు.

MLC Dande Vithal Election Controversy : రాజేశ్వర్ రెడ్డి(Rajeswar Reddy) పిటిషన్ కొట్టివేయాలని విఠల్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్, ఉపసంహరణ పత్రంతో పాటు హైకోర్టులో వేసిన అఫిడవిట్, వకాలత్​ను రామంతపూర్ సీఎఫ్ఎస్ఎల్​కు పంపించాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్​ను హైకోర్టు ఆదేశించింది. రాజేశ్వర్ రెడ్డి సంతకాలను నిర్ధారించాలని సీఎఫ్ఎస్ఎల్​ను కోరాలని.. దానికయ్యే ఖర్చును పిటిషనర్ రాజేశ్వర్ రెడ్డి భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Adilabad MLC Interview : ఆదిలాబాద్‌లో తెరాస అభ్యర్థి దండె విఠల్ విజయం

High Court onMLA Satish Kumar :మరో కేసులో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ కోసం అడ్వకేట్ కమిషన్​ను నియమించింది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్​ అభ్యర్థిగా సతీశ్​ కుమార్ సమీప ప్రత్యర్థి సీపీఐ నేత(CPI Leader) చాడ వెంకట్ రెడ్డిపై గెలిచారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా సతీశ్​ కుమార్ అఫిడవిట్ లేదని.. ఆయన ఎన్నిక రద్దు చేయాలని 2019లో చాడ వెంకట్ రెడ్డి వేసిన పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. వివాదానికి సంబంధించిన సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం అడ్వకేట్ కమిషన్​ను ఏర్పాటు చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్షణ్.. నవంబరు 10లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చాడ వెంకట్ రెడ్డి ఎన్నికల పిటిషన్​ను తిరస్కరించాలన్న సతీశ్​ కుమార్ పిటిషన్​ను ఇప్పటికే హైకోర్టు తోసిపుచ్చింది.

High Court Stay on Ragheri Harika :బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రాగేరి హారిక తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. హారికను తొలగిస్తూ ఈనెల 8న ప్రభుత్వం జీవో 483 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హారిక వేసిన పిటిషన్​పై న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ జరిపారు. కారణం చెప్పకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా తనను తొలగించడం సహజ న్యాయసూత్రాలకు, చట్టానికి విరుద్ధమని హారిక వాదించారు. వాదనలు విన్న హైకోర్టు(High Court) హారిక పిటిషన్​పై రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. అప్పటి వరకు జీవో అమలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana HC on Civil Constable Appointment : సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్.. ఆ 4 ప్రశ్నలు తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు

MLC Dande Vital: 'ఎమ్మెల్సీ అంటే ఇలా ఉండాలి అనేలా మెప్పుపొందుతా'

vittal joined in bjp: నిజమైన ఉద్యమకారులకు భాజపాలోకి ఆహ్వానం: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details