తెలంగాణ

telangana

వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

By

Published : Dec 13, 2022, 4:13 PM IST

Updated : Dec 13, 2022, 5:48 PM IST

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు అనుమతిచ్చాక పోలీసులెలా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తారని ప్రశ్నించింది. రాజకీయ నేతలందరూ పాదయాత్రల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది.

High Court
High Court

షర్మిల పాదయాత్ర అనుమతి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు అనుమతిచ్చాక పోలీసులెలా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తారని ప్రశ్నించింది. రాజకీయ నేతలందరూ పాదయాత్రల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. కోర్టు ఆర్డర్ ఇచ్చినా షర్మిల అభ్యంతకర వాఖ్యలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తెలంగాణను తాలిబాన్ల రాష్ట్రంగా మారుస్తున్నారని షర్మిల అన్నారని పేర్కొన్నారు.

రాజ్‌భవన్ నుంచి బయటకొచ్చాక వైఎస్ షర్మిల ఈ అభ్యంతకర వాఖ్యలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాజభవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతి నిరాకరించారని ధర్మాసనం ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ నేతలపై షర్మిల అనుచిత వాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ.. రాష్ట్రం గురించి వాఖ్యానించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడం సాధారణమని వెల్లడించింది. అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలకు హైకోర్టు సూచించింది.

అంతకుముందు వైఎస్ షర్మిల ఇంటి ముందు పోలీసులను భారీగా మొహరించారు. పాదయాత్రకు అనుమతి విషయంలో హైకోర్టుకు వెళ్లనున్న షర్మిలను.. ఇంటి వద్దనే అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. తమను ఎందుకు కోర్టుకు వెళ్లనీయడం లేదని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బయటకు ఏ వాహనం కూడా వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

షర్మిలను పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకమని.. ఆమె తరుఫు న్యాయవాది వరప్రసాద్ తెలిపారు. కాసేపటికి క్రితమే షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. త్వరలోనే షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. పెద్దవాళ్లు ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో పోలీసులు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వరప్రసాద్ తెలియజేశారు.

ఇవీ చదవండి:దిల్లీలో బీఆర్ఎస్‌ కార్యాలయం పనులను పరిశీలించిన కేసీఆర్‌

'మన సైనికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు'.. తవాంగ్ సెక్టార్​లో ఘర్షణపై రాజ్​నాథ్

Last Updated : Dec 13, 2022, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details