తెలంగాణ

telangana

మేఘానికి చిల్లు.. కుండపోతతో హైదరాబాద్​ వెన్నులో జల్లు..

By

Published : Jul 29, 2022, 4:21 PM IST

Updated : Jul 29, 2022, 8:26 PM IST

Heavy Rain in Hyderabad
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం

16:19 July 29

Rain in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం

Heavy Rain in Hyderabad :హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం దంచి కొట్టింది. మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలైన భారీగా వర్షం మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురయ్యారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో.. రోడ్లపై నీళ్లు నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రోడ్లపై నీళ్లు చేరి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌ చౌరస్తాలో వాహనాలు ఆగిపోయాయి.

మరోవైపు మ్యాన్‌హోల్స్‌ తెరవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. జీహెచ్​ఎంసీ సహాయక చర్యలు చేపడుతోంది. గంటపాటు కొట్టిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలకుతలం మైంది. న్యూబోయిన్‌పల్లిలో చెరువు కట్ట తెగి కాలనీలోకి వరద చేరింది.

Floods in Hyderabad: మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్‌, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, సూరారం, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లిబర్టీ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, అచ్యుత్‌రెడ్డి మార్గ్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, కవాడిగూడ, బోలక్‌ పూర్‌, గాంధీనగర్‌, రాంనగర్‌, దోమల గూడ, ఉప్పల్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

యూసఫ్​గూడలో రిపేర్​షాప్​లోని వాషింగ్​ మిషన్​ నీటిలో కొట్టుకుపోయింది. దానిని ఆపడానికి ఆ షాపు ఓనరు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ నీటి ఉద్ధృతికి అది కొట్టుకుపోయింది. ఇలా భారీ వర్షానికి చాలా మంది వస్తువులు నీటిపాలయ్యాయి.

ఇదీ చూడండి: కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు: కేటీఆర్‌

Last Updated :Jul 29, 2022, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details