తెలంగాణ

telangana

Governor Tamilisai Meerpet Gang Rape : మీర్​పేట్​ గ్యాంగ్ రేప్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. పోలీసులకు గవర్నర్ ఆదేశాలు

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2023, 7:22 PM IST

Governor Tamilisai Meerpet Gang Rape : హైదరాబాద్ మీర్​పేట్​లో మైనర్​ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. బాలికపై గ్యాంగ్ రేప్​ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు. 48 గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాచకొండ పోలీస్ కమీషనర్‌కు గవర్నర్​ ఆదేశాలు జారీ చేశారు.

Meerpet Minor Girl Gangraped at Knife Point
16 years old minor girl gangraped in meerpet

Governor Tamilisai Meerpet Gang Rape మీర్​పేట్​ ఘటనపై స్పందించిన గవర్నర్​.. వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్​, పోలీస్​శాఖకు ఆదేశం

Governor Tamilisai Meerpet Gang Rape :హైదరాబాద్ మీర్​పేట్​లోని మైనర్​ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ఆరా తీశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళిసై.. 48 గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ(DGP), రాచకొండ పోలీస్ కమిషనర్​ సీపీ చౌహాన్​కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని గవర్నర్ సూచించారు.

Meerpet Girl Gang Rape Update :ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ప్రభుత్వం తక్షణమే కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు మీర్​పేట్(Hyderabad Girl Gang Rape 2023)​ వద్ద ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలు, ఆకతాయిల ఆగడాల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. కీచకులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Minor Girl Gang Rape: ప్రేమ పేరుతో లోబరచుకుని.. దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. అవమాన భారంతో..!

ఇదీ జరిగింది..16 ఏళ్ల ఎస్సీ బాలికపై గంజాయి మత్తులో ముగ్గురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తల్లిదండ్రులు లేని బాలిక ఇటీవలే మీర్​పేట్​లోని ఓ కాలనీలో సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందేందుకు వచ్చింది. ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. సోమవారం ఉదయ 9 గంటల సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి.. బాలికను కత్తితో బెదిరించి ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరుగురిని నిందితుల్ని అరెస్టు చేసినట్లు సమాచారం. దారుణానికి ఒడిగట్టిన వాళ్లలో.. టైసన్, మంగళ్ హాట్ రౌడీషీటర్ అబేద్ లాలా ఉన్నారని బాధితురాలి సోదరులు పోలీసులకు తెలిపారు. గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాలు సేవించి దారుణాలకు పాల్పడుతున్న వారి గురించి పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Revanth Reddy on Meerpet Gang Rape :తల్లిదండ్రులు లేని ఎస్సీ బాలికపై దారుణానికి ఒడికట్టిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేశారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయ పార్టీలు నిందితులకు ఉరి శిక్ష వేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు రహదారిపై బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ గంజాయి, మత్తుపదార్థాలకు అడ్డాగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిన్న సింగరేణి, నేడు మీర్‌పేటలో ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలు కలచివేస్తున్నాయని.. ట్వీట్‌ చేశారు.

అతడికి మరణదండన, 92ఏళ్లు జైలుశిక్ష.. బాలుడ్ని చంపి, బాలికను రేప్​ చేసిన కేసులో తీర్పు

ABOUT THE AUTHOR

...view details