తెలంగాణ

telangana

'ప్రతి రక్తపు చుక్క ఓ జీవితాన్ని కాపాడుతుంది'

By

Published : Jun 14, 2022, 12:44 PM IST

Governor on Blood Donors Day : ప్రతి రక్తపు చుక్క ఓ జీవితాన్ని కాపాడుతుందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్​భవన్​లో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

ప్రతి రక్తపు చుక్క ఒక జీవితాన్ని కాపాడుతుంది

Governor on Blood Donors Day : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లోని కమ్యూనిటీ హాల్‌లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. రక్తదానం పట్ల యువతకు మరింత అవగాహన కల్పించాలని గవర్నర్‌ కోరారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం పోలీసులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రక్తదానం కొన్ని ప్రాణాలను కాపాడుతోందని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు.

"ప్రతి రక్తపు చుక్క ఒక జీవితాన్ని కాపాడుతుంది. దీపావళి, సంక్రాంతి, బతుకమ్మ వంటి పండుగలు ఎలా నిర్వహించుకుంటామో.. అదే విధంగా రెడ్‌క్రాస్‌ డే, రక్తదాతల దినోత్సవం జరుపుకోవాలి. రక్తదానంపై చిన్న ప్రేరణ కలిగించినా మరో జీవితాన్ని కాపాడుతుంది. గవర్నర్‌గానే కాకుండా వైద్యవృత్తిలో ఉన్నప్పుడు ఇది నాకు స్వీయ అనుభవం. రక్తదానం చేయడం వల్ల ఎన్నో కేసుల్లో ప్రాణాలను కాపాడగలిగాం. మనం డబ్బు, ఆహారం, పుస్తకాలు దానం చేస్తాం. కానీ రక్తదానం చేస్తే ఒక జీవితాన్ని కాపాడుతుంది. కనుక అన్నిదానాలకంటే రక్తదానం గొప్పది." - తమిళిసై సౌందర రాజన్‌ గవర్నర్‌

ABOUT THE AUTHOR

...view details