తెలంగాణ

telangana

పాలమూరు-రంగారెడ్డి NGT తీర్పుపై SLP వేయాలని నిర్ణయించాం: రజత్​కుమార్

By

Published : Jan 3, 2023, 12:15 PM IST

Updated : Jan 3, 2023, 4:10 PM IST

GRMB meeting
GRMB meeting

12:11 January 03

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

GRMB meeting in Hyderabad today: గోదావరిలో మిగుల జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని గోదావరి యాజమాన్య బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి ప్రాధాన్యంలో ఐదు అంతర్ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తీర్మానించారు.

ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌... సమావేశంలో మొడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్ ల పై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌పై ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తిందన్న రజత్‌కుమార్‌ త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించమన్న ఆయన.. ఈ అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చించాలని జీఆర్‌ఎంబీ సూచించినట్లు వెల్లడించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు రజత్‌కుమార్‌ తెలిపారు. పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు.

మొడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లపై చర్చించాం. ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తింది. గోదావరిలో నీటి లభ్యత ఉందని జలసంఘం డైరెక్టర్ చెప్పారు. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. పోలవరం అంశాన్ని పీపీఏలో చర్చించాలని సూచించారు. గోదావరిలో మిగుల జలాల కోసం అధ్యయనం. అధ్యయన అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని నిర్ణయంచారు. పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ తీర్పుపై ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించాం. పూర్తిస్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తాం. -రజత్‌కుమార్‌, నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

Last Updated :Jan 3, 2023, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details