తెలంగాణ

telangana

'రోజుకు ఓ గంట వ్యాయామం కోసం కేటాయించాలి'

By

Published : Dec 19, 2020, 8:33 PM IST

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు ఓ గంట వ్యాయామం కోసం కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సూచించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఫిట్ ఇండియా కార్యక్రమం ప్రతి ఒక్కరికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. సైక్లోథాన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

gm gajanan mallya said daily one hour per day for exercise
'రోజుకు ఓ గంట వ్యాయామం కోసం కేటాయించాలి'

దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా సైక్లోథాన్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా జెండా ఊపి ప్రారంభించారు.

రోజు సైక్లింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని.. తద్వారా పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని జీఎం తెలిపారు. అనేక దేశాల్లో ఫిట్​నెస్ కోసం సైక్లింగ్​కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు.

యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 నుంచి 31 వరకు ఫిట్ ఇండియా కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 'ఫిట్ నెస్ కా డోజ్ ఆదా గంట రోజ్' అనే నినాదంతో ఫిట్ ఇండియా ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చూడండి :మంత్రుల వాహనాలను అడ్డుకోబోయిన నేతలు

ABOUT THE AUTHOR

...view details