తెలంగాణ

telangana

మానవత్వం చాటుకున్న మేయర్​ విజయలక్ష్మి

By

Published : Mar 31, 2021, 4:59 PM IST

కూలీ చేసుకునే జీవించే ఓ మహిళకు క్యాన్సర్ వచ్చింది. చికిత్స కోసం డబ్బులు లేక సోదరుడితో కలిసి వందల కిలోమీటర్ల దూరం దాటి హైదరాబాద్​కు వచ్చింది. ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. వైద్యులు ఐదు రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఊరెళ్లి రావాలంటే డబ్బులు కావాలి.. దీంతో ఆస్పత్రి పక్కన ఓ చెట్టు కింద ఉంటున్నారు. అటుగా వెళ్తున్న మేయర్​ విజయలక్ష్మి వారి ఇబ్బందులకు చలించి సాయం చేశారు. ​

Vijayalaxmi
విజయలక్ష్మి

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఓ క్యాన్సర్ రోగి దీనస్థితిని చూసి చలించిపోయారు. చెట్టునీడన ఆశ్రయం పొందుతున్న ఆ రోగిని ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. రోగికి అయ్యే ఖర్చులు భరిస్తానని చెప్పి ఆస్పత్రి గదిలోకి మార్చారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన పాండురంగ కరాడే సోదరి ఇందూబాయి నోటి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు.

ఆమెను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు ఐదు రోజులకు తీసుకురావాలని సూచించారు. నాందేడ్‌కు వెళ్లి మళ్లీ తిరిగి ఐదు రోజులకే హైదరాబాద్‌కు రావాలంటే దారి ఖర్చులు ఎక్కువవుతాయని భావించిన పాండురంగ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుని ఆస్పత్రి సమీపంలోని ఓ చెట్టుకింద ఆశ్రయం పొందుతున్నారు. నోటి క్యాన్సర్ కారణంగా సోదరి ఇందూబాయి ఘనాహారం తీసుకోవడంలేదు. దీంతో సోదరికి పైపు ద్వారా ద్రవాహారం అందిస్తున్నాడు.

అటుగా వెళ్తున్న మేయర్‌ ఆరా తీయగా కూలీ చేసుకునే తనకు ఖర్చులు భరించే శక్తిలేదని.. గదిని కూడా అద్దెకు తీసుకునే స్తోమత లేదని చెప్పటంతో విజయలక్ష్మి చలించిపోయారు. వెంటనే వారికి ఆస్పత్రిలో అద్దె గదిని ఇప్పించి ఖర్చులు తానే భరిస్తానని ఆస్పత్రివర్గాలకు తెలిపారు.

మేయర్​ విజయలక్ష్మి

ఇదీ చదవండి: వెంటాడిన లాక్​డౌన్​ భయం- సెన్సెక్స్ 627 డౌన్

ABOUT THE AUTHOR

...view details