తెలంగాణ

telangana

హైదరాబాద్‌ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు సన్నాహక సమావేశాలు షురూ

By

Published : Mar 4, 2023, 8:31 PM IST

G20 meeting in hyderabad: హైదరాబాద్‌ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్‌ పార్టనర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ రెండో విడత సమావేశాల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు నాలెడ్ట్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎక్స్చేంజ్‌ ఫర్‌ ది ఎమర్జింగ్‌ ఎకానమీస్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ సౌత్‌ పేరుతో జరుగుతున్నాయి.

జీ-20 సన్నాహక ఆర్థిక సదస్సు
జీ-20 సన్నాహక ఆర్థిక సదస్సు

G20 meeting in hyderabad: అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా నిలిచే జీ-20 సదస్సుకు ఈ ఏడాది భారత్‌ నేతృత్వం వహిస్తోంది. ఇందులో భాగంగా గ్లోబల్ పార్టనర్​షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ థీమ్‌తో హైదరాబాద్‌లో సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్‌ పార్టనర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ రెండో విడత సమావేశాల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు.

నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్చేంజ్ పేరుతో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌, హెల్త్‌కేర్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో జీ20 ఇండియా ముఖ్య సమన్వయకర్త హర్షవర్ధన్‌ శ్రింగ్లా పాల్గొన్నారు. ఈ ఏడాది జీ-20 దేశాల సదస్సులకు భారత్‌ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 25 నగరాల్లో 36 సదస్సులు నిర్వహించినట్లు జీ20 ముఖ్య సమన్వయకర్త హర్ష వర్ధన్ శ్రింగ్లా తెలిపారు.

'గ్లోబల్‌ పార్టనర్‌ షిప్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌' సమావేశాల కోసం హైదరాబాద్‌ వచ్చాం. జీ-20 సదస్సులో ఇది చాలా కీలక సమావేశం. భారత్‌ ఇప్పటికే డిజటల్‌ రంగంలో తన అనుభవాలను, సాధించిన విజయాలు, మౌలిక సదుపాయాల కల్పనను వివిధ దేశాలతో పంచుకునేందుకు సమ్మతి తెలిపింది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి భాగస్వామ్యం కల్పించేందుకు గ్లోబల్‌ సౌత్‌లోని అభివృద్ధి చెందిన దేశాలు సమాచారం, అనుభవాలు పంచుకోనున్నాయి. మేము అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను వారితో పంచుకోనున్నాం.

డిజిటల్‌ చెల్లింపులు, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, డిజిటల్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జరిగిన చర్చా గోష్ఠిలో ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సొనాలి సేన్‌ గుప్తా, సీనియర్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ నిపుణులు ప్రేర్నా సక్సేనా పాల్గొన్నారు. దేశాన్ని డిజిటలైజేషన్‌ చేసేందుకు ఇప్పటికే ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలను చేపట్టారని.. వాటివల్ల దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎంతగానో పెరిగాయని చర్చించారు. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై 6, 7వ తేదీల్లో చర్చించనున్నట్లు సీనియర్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ ఎక్సపర్ట్‌ ప్రేర్నా సక్సేనా తెలిపారు.

భారత్‌ నుంచి మాత్రమే కాకుండా దాదాపుగా 24కు పైగా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో వచ్చే రెండు రోజుల పాటు అత్యంత ఆసక్తికరమైన చర్చలు కొనసాగనున్నాయి. ఆఫ్రికన్‌ యూనియన్‌, అరబ్‌ మానిటరీ ఫండ్‌ వంటి సంస్థలకు మంచి వీక్షకులుగా ఉండనున్నాం. డిజటల్‌ ఆర్థిక సమ్మిళిత రంగంలో వారి ప్రయాణంలో ఇప్పటికే ప్రారంభించిన, కొనసాగుతున్న సవాళ్లను తెలుసుకోనున్నాం. ప్రపంచ దక్షిణాది దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, సాధించిన లక్ష్యాలు తదితర అంశాలపై మూడురోజుల సదస్సులో చర్చించనున్నట్లు వివిధ దేశాల ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్​లో జీ-20 సన్నాహక ఆర్థిక సదస్సు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details