తెలంగాణ

telangana

Job Vacancies in Telangana: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు

By

Published : Jul 11, 2021, 7:06 AM IST

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల(Job Vacancies in Telangana)పై ఆర్థికశాఖ(finance ministry) కసరత్తు షురూ చేసింది. నేడు అన్ని శాఖల(all departments)తో ముఖ్య కార్యదర్శి కీలక భేటీ నిర్వహించనున్నారు. శాఖల వారీగా నివేదికలివ్వాలని ఉత్తర్వుల జారీ చేశారు. ఈ నెల 13న మంత్రిమండలిలో మొత్తం ఉద్యోగాల భర్తీ(job recruitment)కి ఆమోదం తెలియజేయనున్నారు.

Job Vacancies in Telangana, finance exercise on vacancies
ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు

రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీ(Job Vacancies recruitment in Telangana) ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌(cm kcr) ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో ఖాళీల గుర్తింపునకు ఆర్థికశాఖ(finance ministry) కసరత్తు చేపట్టింది. ఈరోజు ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ(MCHRD)లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ కావాల్సిన ఖాళీలపై ప్రభుత్వం గత ఏప్రిల్‌లో మొదటి దఫా వివరాలు సేకరించింది. తాజాగా జోనల్‌ వ్యవస్థ నేపథ్యంలో ఆయా శాఖల్లో, వాటి పరిధి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఇవాళ జరిగే సమావేశంలో పశుసంవర్ధక, పౌరసరఫరాలు, అటవీ, నీటిపారుదల, కార్మిక, హోం, న్యాయ, శాసనసభ, పురపాలక, పర్యాటక తదితర శాఖల అధికారులతో సమావేశమై శాఖాపరమైన ఖాళీలతో పాటు జిల్లాలు(DISTRICTS), జోన్‌లు(ZONES), బహుళ జోన్ల(MULTI ZONES) వారీగా వివరాలు తీసుకుంటారు.

పక్కాగా వివరాలుండాలి

ఈ నెల 13న మంత్రిమండలిలో మొత్తం ఉద్యోగాల భర్తీ(Job recruitment)కి ఆమోదం తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో పక్కా వివరాలతో నివేదికను అందజేయాలని, దీనిని అత్యంత ప్రాధాన్యమైందిగా భావించి ముందుగా ఆయా శాఖల్లోని అధికారులంతా చర్చించి, ప్రత్యక్ష నియామకాలపై పూర్తి సమాచారం అందజేయాలని రామకృష్ణారావు సూచించారు. సమావేశంలో అందిన వివరాలతో ఈ నెల 12న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సోమేశ్‌కుమార్‌కు ఆర్థికశాఖ నివేదిక సమర్పించనుంది. దానిని ఆయన సీఎం కేసీఆర్‌కు, మంత్రిమండలికి అందజేస్తారు. మొదటి దశలో భర్తీచేయనున్న ఖాళీలతో పాటు అన్ని శాఖల్లో పదోన్నతుల నిర్వహణపై సమావేశంలో చర్చిస్తారు. పదోన్నతుల అనంతరం ఖాళీ అయ్యే పోస్టుల అంచనాలను తీసుకుంటారు.

ఇవీ చదవండి: HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై కసరత్తు

ABOUT THE AUTHOR

...view details