తెలంగాణ

telangana

రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫైల్స్ చోరీ - దీని వెనక మాయా మర్మమేంటి?

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 7:44 AM IST

Files Missing Cases Former Minister's Office in Telangana : ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా కీలక దస్త్రాలు మాయమవుతున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పర్యాటక భవన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని పత్రాలు కాలిబూడిదకాగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దగ్గర పనిచేసిన ఓఎస్డీ కార్యాలయంలో కొన్ని ఫైల్స్‌ కనిపించకుండా పోయాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. విద్య పరిశోధన శిక్షణ సంస్థలో పత్రాల చోరీకి యత్నం జరిగింది. ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ నాయకులు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.

Files missing offices former ministers Telangana
Files missing offices former ministers Telangana

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఫైల్స్ చోరీ

Files Missing Cases Former Ministers Offices in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వద్ద పనిచేసిన, ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో కొన్ని దస్త్రాలు మాయమయ్యాయి. కిటికీ గ్రిల్స్‌ తొలగించిన దుండగులు ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు కార్యాలయం వాచ్‌మెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Files Missing in Telangana Animal Husbandry Department :మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) ఓఎస్డీ కల్యాణ్‌ ఛాంబర్‌ ఉంది. శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో కిటికీ గ్రిల్స్‌ తొలగించిన కొందరు, కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడ నుంచి కీలక పత్రాలు కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు దుమారం రేపాయి. రాత్రి వాచ్‌మెన్‌ తాళాలు తీసి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా, ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా పడి ఉన్నట్లు అతను గుర్తించాడు. అయితే అక్కడ నుంచి పత్రాలు అన్ని సచివాలయానికి చేరవేశారని దస్త్రాలు మాయం కాలేదని ఓఎస్డీ కల్యాణ్‌ చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారించినట్లు సమాచారం.

జాబ్​ స్కామ్​ కేసులో ED జోరు.. రూ.600 కోట్ల పత్రాలు, రూ. కోటి నగదు స్వాధీనం

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఫొటోలు : కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు, ఓఎస్డీ కార్యాలయాల్లోకి ఆగంతకులు ప్రవేశించి, అక్కడి నుంచి కీలక పత్రాలు మాయం చేస్తున్నారు. ఇటీవలే హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివృద్ధి కార్యాలయంలో (Telangana Tourism Development Office) అగ్నిప్రమాదం, రవీంద్ర భారతి నుంచి ఫర్నీచర్‌ అక్రమ తరలింపు సహా పశుసంవర్ధక శాఖలో ముఖ్యమైన ఫైల్స్‌ మాయం కావడం, సాంకేతిక విద్యామండలి కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు కొన్ని పత్రాలతో పారిపోతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు :మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్‌ అదే ఆవరణలో ఉండడం, మీడియా రావటంతో ఆగంతకులు హడావుడిగా వెళ్లిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవన్నీ ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌, సామాజిక మాధ్యమాల్లో లభించిన వివరాల ఆధారంగా అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారు.

బైజూస్​ సీఈఓ ఇంట్లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రాత్రివేళ కార్యాలయంలోకి ప్రవేశించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దస్త్రాల మాయం వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌ డీజీపీ రవిగుప్తాకు లేఖ రాశారు. ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

"విద్యాశాఖ కార్యాలయం నుంచి ఒక ఆటో సామానుతో బయటికి వెళ్లిందని చెప్పారు. వెంటనే ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. వివరాలను సేకరిస్తున్నాం. పశుసంవర్ధక కార్యాలయంలో కొన్ని దస్త్రాలు చించేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వాచ్‌మెన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం."- శ్రీనివాస్‌, మధ్యమండలం డీసీపీ

భద్రాచలంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం - కాలి బూడిదైన కీలక దస్త్రాలు

500 ప్రభుత్వ ఫైళ్లు మిస్సింగ్- అక్రమ కొనుగోళ్లకు సంబంధించినవే!

ABOUT THE AUTHOR

...view details