ETV Bharat / state

జీహెచ్‌ఎంసీలో బోగస్‌ పత్రాల కేసు.. నలుగురిపై వేటుకు రంగం సిద్ధం

author img

By

Published : Mar 9, 2023, 3:04 PM IST

GHMC Fake Certificates Update
GHMC Fake Certificates Update

Fake Birth and Death Certificates Case in GHMC: నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వ్యవహారంలో మహానగర పాలక సంస్థ చర్యలకు ఉపక్రమించింది. విచారణలో 21 వేల సర్టిఫికెట్లకు సంబంధించి జారీలో అవకతవకలు జరిగాయని జీహెచ్​ఎంసీ అధికారులు తేల్చారు. గణాంకాల విభాగంలో పనిచేసే నలుగురిపై వేటుకు రంగం సిద్దమైంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉంది అనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Fake Birth and Death Certificates Case in GHMC: జీహెచ్‌ఎంసీలో బోగస్‌ జనన, మరణ దృవీకరణ పత్రాల జారీ కేసులో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే పలువురు బీజేపీ కార్పొరేటర్లు అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని.. నగర పాలక సంస్థ ప్రధాన కార్యలయంలో ఆందోళన బాట పట్టారు. విమర్శలు రావడంతో మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

Fake Birth And Death Certificates Case Update News: సమీక్ష సమావేశంలో మేయర్‌ జరిగిన అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ జనన, మరణ దృవీకరణ సర్టిఫికెట్లను జారీ చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని మేయర్ విజయలక్ష్మి.. నగర పాలక సంస్థ కమిషనర్‌ లోకేశ్ కుమార్‌కు సూచించారు. విచారణలో 21 వేల బోగస్‌ సర్టిఫికెట్లకు సంబంధించి జారీలో అవకతవకలు జరిగాయని బల్ధియా అధికారులు తేల్చారు. అయితే ఆర్టీవో ప్రొసీడింగ్‌ లేకుండా ఈ సర్టిఫికెట్లు మంజూరయినట్టు అధికారులు చెబుతున్నారు.

14 మీసేవా కేంద్రాల్లో సర్టిఫికెట్లు అప్​లోడ్ అయినట్ట గుర్తింపు: ఇవి తీసుకున్న వారికి నోటీసులు ఇస్తామంటున్నారు. వారంతా తిరిగి అన్నీ దృవీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అయితే వీటిని రద్దు చేసినట్టే అంటున్నారు. 14 మీసేవా కేంద్రాల్లో ఈ విధమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ అయినట్టు గుర్తించిన అధికారులు.. దీనిపై మీసేవా సంచాలకుడికి లేఖ రాయనున్నారు.

సంబంధం ఉన్న అందరిపై క్రిమినల్ కేసు పెడతాం: మరో వైపు స్టాటిస్టికల్‌ విభాగంలో పనిచేసే నలుగురు నకిలీ సర్టిఫికెట్ల జారీలో తమ వంతు పాత్ర పోషించినట్టు గుర్తించిన అధికారులు వారిపై కూడా వేటు వేయడానికి సిద్దం అవుతున్నారు. ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న అందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్‌ కేసులు పెడతామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి స్పష్టం చేశారు. బోగస్‌ జనన, మరణ దృవీకరణ పత్రాల వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోనున్నట్టు.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మహానగర పాలక సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Fake Birth And Death Certificates Case In Hyderabad: వ్యవస్థలోని లోపాన్ని అనుకూలంగా మలుచుకుంటున్న కొందరు దళారులు మనీ కోసం నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. దళారులకు బల్దియా సిబ్బంది సహకారం ఉండటంతో వారి దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. పోలీసులు నిఘాపెట్టి దాడులుచేస్తే తప్ప ఇలాంటి మోసాలు బయటపడట్లేదు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన 31 వేల నకిలీ ధ్రువపత్రాల జారీపై బల్దియా విచారణ చేపట్టింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.