తెలంగాణ

telangana

ys sharmila meet pk team: ప్రశాంత్​ కిశోర్​ బృందంతో వైఎస్​ షర్మిల భేటీ.. కీలక అంశాలపై చర్చ!

By

Published : Sep 29, 2021, 8:03 PM IST

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ బలోపేతం, విస్తరణ సహా భవిష్యత్​ కార్యాచరణపై పార్టీ అధ్యక్షురాలు(ysrtp president ys sharmila)షర్మిల దృష్టిసారించారు. హైదరాబాద్​ లోటస్ ​పాండ్​లో వైఎస్​ షర్మిలను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ (election stagestist prashant kishor) బృంద ప్రనిధులు కలిశారు. అక్టోబర్​ 20 నుంచి షర్మిల చేపట్టనున్న పాదయాత్రకు రూట్​ మ్యాప్​, భవిష్యత్​ కార్యాచరణపై.. వారు చర్చించినట్లు సమాచారం. ఇక అక్టోబర్ 3న ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా కొడంగల్​ నియోజకవర్గం కోస్గీలో బీసీ గౌరవసభ నిర్వహిస్తున్నట్లు వైఎస్​ఆర్​టీపీ తెలంగాణ పార్టీ ప్రకటించింది.

election stagestist prashant kishor team
election stagestist prashant kishor team

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ (ysr telangana party)భవిష్యత్​ కార్యాచరణపై వైఎస్​ షర్మిల దృష్టిసారించారు. అందులో భాగంగా పార్టీ విస్తరణ, వచ్చే నెల 20 నుంచి చేపట్టనున్న పాదయాత్ర రూట్​మ్యాప్​ తదితర అంశాలపై ప్రశాంత్​కిశోర్​ టీంతో వైఎస్ ​షర్మిలతో భేటీ (prashant kishor team meet ysrtp chief ys sharmila) అయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలపై చర్చించినట్లు వైఎస్​ఆర్​టీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్​ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చించినట్లు వైఎస్​ఆర్​టీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీసీ గౌరవ సభ పోస్టర్​ విడుదల..

వైఎస్ఆర్​టీపీ ఆధ్వర్యంలో మహబూబ్​నగర్​ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి జూనియర్ కాలేజీ గ్రౌండ్​లో అక్టోబర్ 3న బీసీగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీగౌరవ సభకు సంబంధించిన పోస్టర్​ను ఇవాళ ఆవిష్కరించారు.

హుజూరాబాద్​ ఉపఎన్నికలో..

ఏడేళ్లలో తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బీసీల అభివృద్ధిని.. తెరాస ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు. హుజురాబాద్​ ఉపఎన్నికలో (huzurabad bypoll) నిరుద్యోగుల తరఫున నామినేషన్లను వేయాలని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీనీ ఏర్పాటు చేసింది.

షర్మిల పాదయాత్ర ఇలా...

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు గతంలోనే వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతుందని... జీహెచ్​ఎంసీ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 12 - 15 కి.మీ మేర పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించి... చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.

పాదయాత్రలకు వైఎస్​ఆర్ బ్రాండ్ అంబాసిడర్​ అని.. ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్​కు భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎలా అమ్ముడుపోయాయో పాదయాత్రలో ప్రజలకు చెబుతామని షర్మిల చెప్పారు. ప్రతి పల్లెకు వెళ్లి.. ప్రతి గడపా తడతామని స్పష్టం చేశారు.

ఏపీలోనూ పీకే బృందం మరోసారి..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​ టీం మరోసారి ఏపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా తమిళనాడులో డీఎంకే, బంగాల్​లో టీఎంసీని విజయతీరాలకు చేర్చేందుకు వ్యూహాలు రచించిన పీకే.. మరోసారి ఏపీలో జగన్​తో జట్టుకట్టనున్నారు. 2019 ఎన్నికల్లోనూ జగన్​ విజయానికి ప్రశాంత్​ కిశోర్​ వ్యూహాలు రచించారు.

ఇదీచూడండి:YS Sharmila Padayatra: అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర.. చేవెళ్లలో ప్రారంభం

TAGGED:

ABOUT THE AUTHOR

...view details