తెలంగాణ

telangana

హెచ్‌సీఏ అక్రమాలపై రంగంలోకి దిగిన ఈడీ - మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 10:27 AM IST

Updated : Dec 30, 2023, 12:25 PM IST

ED Investigation in HCA Case : హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు మాజీ క్రికెటర్లను అధికారులు విచారించింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు వినోద్‌కు నోటీసులు జారీ చేసింది.

ED raids in Hyderabad Cricket Association
ED raids in Hyderabad Cricket Association

ED Investigation in HCA Case : హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అక్రమాలపై, ఈడీ విచారణ కొనసాగుతోంది. హెచ్‌సీఏలో (HCA Case) జరిగిన రూ.20 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్షద్‌ ఆయూబ్‌, శివలాల్‌ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్‌ రెండు రోజుల పాటు విచారించింది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

ED Raids in EX Cricketers Houses in Hyderabad :జనవరి మొదటి వారంలో ఈడీ ఎదుట హాజరుకావాలని వినోద్‌కు నోటీసులు పంపించింది. కాగా ఉప్పల్ స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు గోల్‌మాల్‌ చేశారని, అవినీతి నిరోధక శాఖ 3 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసును నమోదు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇదే వ్యవహారంలో నవంబర్‌లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు, రూ.10,39,000ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate)అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

అసలేం జరిగిదంటే : ఒప్పందానికి విరుద్ధంగా 2013లో ఉప్పల్ స్టేడియంలో నిర్మాణాలు జరిగాయని, అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) కేసులు నమేదు చేశారు. వాణిజ్య అవసరాలకు ఉప్పల్‌ స్టేడియంలో నిర్మాణాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొన్నా, దాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. స్టాండ్‌ల నిర్మాణం సందర్భంగా వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగాయని తెలిపారు. గుత్తేదారుతో కుమ్మక్కై హెచ్‌సీఏకు నష్టం వాటిల్లేలా చేశారని అనిశా అధికారులు అభియోగపత్రంలో వివరించారు. ఏసీబీ అభియోగపత్రం ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన మాజీ ఎంపీ వివేక్ - విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా 100 కోట్లు బదిలీ!

Police Case Against HCA Funds Issue :మరోవైపు నిధులు గోల్​మాల్ వ్యవహారంలో హెచ్​సీఎపై నాలుగు కేసులుఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యాయి. ఉప్పల్‌ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్లలో, కోట్ల రూపాయల మేర గోల్‌మాల్‌ జరిగిందని సునీల్ కంటే ఫిర్యాదులో పేర్కొన్నారు. అగ్నిమాపక, జిమ్‌సామాగ్రి, క్రికెట్‌ బంతులు, బకెట్‌కుర్చీల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు తెలిపారు. 2019- 2022 మధ్య అపెక్స్‌ కౌన్సిల్‌ ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పుడు హెచ్​సీఎ అధ్యక్షుడిగా అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్‌మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, సంయుక్తకార్యదర్శిగా నరేశ్‌ శర్మ, కోశాధికారిగా సురేందర్‌ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్నారు.

మహాదేవ్ బెట్టింగ్ యాప్​ కేసు- 'ప్రమోటర్ల నుంచి సీఎం బఘేల్​కు రూ.508కోట్ల చెల్లింపులు'

Last Updated :Dec 30, 2023, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details