ETV Bharat / state

హెచ్​సీఏపై మరో కేసు నమోదు.. మ్యాచ్​ సమయం తప్పుగా ముద్రించారని ఫిర్యాదు

author img

By

Published : Sep 28, 2022, 1:07 PM IST

Police registered another case against HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై మరో కేసు నమోదయ్యింది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్లపై సమయం తప్పుగా ముద్రించారని న్యాయవాది ఫిర్యాదు చేయగా బేగంపేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

Hyderabad Cricket Association
Hyderabad Cricket Association

Police registered another case against HCA: సికింద్రాబాద్​లోని జింఖానా మైదానంలో ఆస్ట్రేలియా- భారత్​ క్రిక్రెట్​ మ్యాచ్​ సందర్భంగా టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట వివాదానికి సంబంధించి హైదరాబాద్​ క్రిక్రెట్ అసోసియేషన్​పై మరో కేసు నమోదైంది. క్రికెట్ మ్యాచ్​కు సంబంధించి సమయాన్ని తప్పుగా టికెట్లపై ముద్రించారని న్యాయవాది ఫిర్యాదు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మ్యాచ్ సమయాన్ని తప్పుగా ముద్రించడం వల్ల క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురైయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బేగంపేట పోలీసులు హేసీఏపై కేసు నమోదు చేశారు. టికెట్ విక్రయాలకు సంబంధించి అవకతవకల విషయంలో ఇప్పటికే హేచ్​సీఏపై మూడు కేసులు నమోదు కాగా, తాజా కేసుతో వాటి సంఖ్య నాలుగుకి చేరుకుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.