తెలంగాణ

telangana

దిల్లీ మద్యం కుంభకోణం.. తొలి ఛార్జ్​షీట్ దాఖలు చేసిన ఈడీ

By

Published : Nov 26, 2022, 8:54 PM IST

Delhi Liquor Scam Updates: దిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే 3వేల పేజీలతో తొలి ఛార్జ్​షీట్‌ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నట్లు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలిపింది.

ed filed first charge sheet in delhi liquor scam case
ed filed first charge sheet in delhi liquor scam case

Delhi Liquor Scam Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో 3,000పేజీలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరైక్టరేట్‌ తొలి ఛార్జ్​షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నట్లు తెలిపిన ఈడీ.. మిగిలిన నిందితులపైనా త్వరలో ఛార్జ్‌షీట్ వేయనున్నట్లు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టుకు వివరించింది. దిల్లీ మద్యం స్కామ్‌లో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు కోర్టుకు తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న ప్రత్యేక న్యాయస్థానం.. ఆ అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు సమయం పడుతుందని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:దిల్లీ లిక్కర్​ స్కామ్​.. ఏడుగురి పేర్లతో సీబీఐ తొలి ఛార్జిషీట్

ABOUT THE AUTHOR

...view details