తెలంగాణ

telangana

Double Bedroom 3rd Phase Distribution : నేడు జీహెచ్​ఎంసీలో మూడో విడత డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పంపిణీ

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 7:37 AM IST

Double Bed Room 3rd Phase Distribution Telangana : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి రెండు పడక గదులు ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే రెండు విడతల్లో లబ్దిదారులకు ఇళ్లు అందించిన సర్కారు మూడో విడతలో భాగంగా ఇవాళ మరికొన్ని ఇళ్లు అందించనుంది. మొత్తం 36వేల 884 మందిని ఎంపిక చేయగా.. ఇవాళ 19వేల 20మందికి మిగిలిన వారికి ఈనెల 5న పంపిణీ చేయనున్నారు. నగరంలోని 9 ప్రాంతాల్లో హరీశ్‌రావు, తలసాని సహా ఇతర మంత్రులు రెండు పడక గదులు ఇళ్లు అందించనున్నారు.

Harish Rao 2 BHK Flats Distribute at Kollur
Double Bedroom 3rd Phase Distribution in Medchal

Double Bedroom 3rd Phase Distribution మూడో విడత డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పంపిణీ

Double Bedroom 3rd Phase Distribution in Telangana: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మూడో విడత ఎంపికైన లబ్దిదారులకు డబుల్​బెడ్​ రూం ఇళ్ల(Double Bed Room Houses)ను పంపిణి చేయనున్నారు. మూడో విడతలో మిగిలిన వాటిని ఈ నెల 5 తేదీలలో పంపిణి చేస్తారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచనల మేరకు రూ.9,600 కోట్ల వ్యయంతో గ్రేటర్ పరిధిలో ఎంతో విలువైన స్థలాల్లో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఎంతో పారదర్శకంగా, రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్​లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి పంపిణి చేస్తున్నారు.

Double Bedroom Housing Community at Kollur : కొల్లూర్​లో ఆసియాలోనే అతిపెద్ద 2BHK ప్రాజెక్టు.. రేపే ప్రారంభోత్సవం

BRS Leaders Distribute 2BHK Flats: మేడ్చల్​- మల్కాజిగిరి జిల్లాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్​లో హోంమంత్రి మహమూద్ అలీ 3,142 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణి చేయనున్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్​పల్లిలో మైనింగ్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 1361 మంది లబ్ధిదారులకు, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్ సాన్​పల్లిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి 2099 మందికు అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్​లో 472 మందికి పంపిణి చేస్తారు.

Double Bed Room Houses Distribution: లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగొండలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 344 మంది లబ్దిదారులకు.. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్​లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 356 మందికి.. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు -2లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) 6067 మంది లబ్దిదారులకు ఇళ్లను పంపిణిచేస్తారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అహ్మద్ గూడలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1965 మంది లబ్దిదారులకు.. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని రాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 3214 మందికు ఇళ్లను పంపిణి చేయనున్నారు.

ఇవాళ బీఆర్​ఎస్ నాయకులు ఏ ఏ నియోజకవర్గంలో ఎవరు లబ్ధిదారులకు ఇళ్లను పంపిణి చేయనున్నారో వారి వివరాలు:

నాయకుడు నియోజక వర్గం ఎన్ని ఇళ్లు పంపిణి
మంత్రి హరీశ్​రావు పటాన్ చెరువు(కొల్లూరు -2) 6067
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

మహేశ్వరం (మన్ సాన్​పల్లి),

ఇబ్రహీంపట్నం(అబ్దుల్లాపూర్ మెట్​)

2099 , 472
మంత్రి మహమూద్ అలీ కుత్బుల్లాపూర్ (దుండిగల్​) 3,142
మంత్రి మహేందర్ రెడ్డి చేవెళ్ల(శంకర్​పల్లి) 1361
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ శేరిలింగంపల్లి(నల్లగొండ) 344
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజేంద్ర నగర్(నార్సింగ్​) 356
మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ (అహ్మద్ గూడ) 1965
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేడ్చల్(రాంపల్లి) 3214

2BHK Flats Lucky Draw in Hyderabad Today : GHMC పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి లక్కీ డ్రా

Revenue Inspector Cheating On Double Bed Room Houses : డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ పేరుతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మోసం...!​

ABOUT THE AUTHOR

...view details