తెలంగాణ

telangana

ప్రేమికుల దినోత్సవం నాడు చేయకూడని పనులు ఏంటి?

By

Published : Feb 14, 2023, 7:30 AM IST

Valentines Day 2023: వాలెంటైన్స్ డే అంటే లవర్స్ కి పండగే. ప్రస్తుతం ప్రపంప వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రేమికులు ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ఒక్కో రోజును ఒక్కో లా జరుపుకుంటూ ఆనందిస్తున్నారు. ఇక ఇందులో చివరి రోజైన ఫిబ్రవరి 14ను ప్రతి ఒక్కరూ ఘనంగా సెలెబ్రేట్ చేసుకోవాలని భావిస్తారు. ఇందుకోసం రకరకాల ప్లాన్లు వేస్తూంటారు.

Valentines Day 2023
Valentines Day 2023

Valentines Day 2023: వాలెంటైన్స్ డే ని సెలెబ్రేట్ చేసుకోవాలని ప్రతి ప్రేమ జంట ఆరాట పడుతుంది. అందుకు అనుగుణంగా సిద్ధమవుతుంటారు. అక్కడికెళదాం.. అలా చేద్దాం అనుకుంటూ.. రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఈ సమయంలో తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. మరి ఆ చేయకూడని పనులేంటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

1. Do not Forget to Wish: ఈ రోజున మీరు చేయాల్సిన మొట్ట మొద‌టి ప‌ని ప్రేమికుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం. ఈ విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోకండి. కొంత మందికి శుభాకాంక్ష‌లు చెప్పే అల‌వాటు ఉండ‌దు. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలా అనుకుంటారు. " విష్ చేస్తేనే ప్రేమ ఉన్న‌ట్టా " అనే వితండ వాదం చేసేవాళ్లూ లేక‌పోలేదు. అయితే ప్రేమ ఉన్న‌ప్పుడు దాన్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌టంలో త‌ప్పులేదు క‌దా. సో లేట్ చేయ‌కుండా పొద్దున్నే ఒక మంచి సందేశంతో, క‌లిసి న‌ప్పుడు ఒక చిరున‌వ్వుతో శుభాకాంక్ష‌లు తెల‌పండి.

2. Dont Hurt them: మీకు ప్ర‌త్యేక‌మైన రోజున... మీరు ప్రేమించే వారిని హ‌ర్ట్ చేయ‌కండి. ఎందుకంటే ఈ రోజున మీ నుంచి చాలా ఆశిస్తారు. ఆ రోజు కేవలం ఫోన్ కాల్ తోనే స‌రిపెట్ట‌కుండా.. నేరుగా వెళ్లి క‌ల‌వండి. బ‌య‌టికి తీసుకెళ్లండి. మీకు తోచిన చిన్న బ‌హుమ‌తి ఇవ్వండి. మీ ప్రియ‌ప‌మైన వారిని బైక్ పై షికారుకు తీసుకెళ్లండి. బండి లేకుంటే మీ ఫ్రెండ్స్ ని అడిగి తీసుకెళ్లండి.

3. Give atleast Small Gift: చాలామంది నేడు వారి ప్రియుల నుంచి బ‌హుమ‌తులు ఆశిస్తారు. అది చిన్న‌దైనా స‌రే. కొంత‌మంది దీనికోసం ముందే ప్లాన్ చేసుకుంటారు. అయితే.. ప్లాన్ చేయ‌క‌పోయినా స‌రే... ఏదోక గిఫ్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయండి. షాపింగ్ కి లేదా రెస్టారెంట్‌కి తీసుకెళ్ల‌టం, వారికి న‌చ్చింది కొనివ్వ‌టం చేయండి. ఏదీ కుద‌ర‌క పోతే అమ్మాయిలు తొంద‌ర‌గా ప‌డిపోయే చాక్లెట్ అయినా ఇవ్వండి.

4. Dont Compare with others: చాలామంది ఈ రోజు ఇత‌రుల‌తో పోల్చుకుంటారు. వాళ్లు ఈ బ‌హుమ‌తులు ఇచ్చారు. ఈ వ‌స్తువులు కొనిచ్చారు అని పోల్చుతూ.. గొడ‌వ‌లు పెట్టుకుంటారు. ఇది ఎంత‌మాత్ర‌మూ మంచిది కాదు. దీని వ‌ల్ల ఎదుటి వారికి ఒక తెలియ‌ని చెడు భావ‌న క‌లుగుతుంది. ఎవరు ఏం ఇచ్చార‌ని కాకుండా... ఉన్న‌దాంట్లో, ఇచ్చిన దాంతో సంతృప్తి పడి.. ఈ రోజుని సంతోషంగా గ‌డ‌పండి.

5. Spend Time With Your Loved Onces: నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఇద్ద‌రు క‌లుసుకుని మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడుకోవ‌డం త‌క్కువ అయింది. అది చ‌దువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం ఏదైనా కానీ.. క‌లిసి స‌మ‌యం గ‌డిప‌డం చాలా అరుదు. కాబ‌ట్టి ఈ స్పెష‌ల్ రోజున మీ స్పెష‌ల్ ప‌ర్స‌న్ తో కాస్త స‌మ‌యం గ‌డ‌పండి. ఎన్ని పనులున్నా వాటిని ప‌క్క‌న పెట్టి వారిని క‌ల‌వండి. క‌లిసి లంచ్ లేదా డిన్నర్ చేయండి. వీలైతే మీ ఫేవ‌రేట్ ప్లేస్ లేదా.. ఇద్ద‌రిరీ ఇష్ట‌మైన ప్రాంతానికి వెళ్లి కాసేపు క‌బుర్లు చెప్పుకోండి.

6. Dont Give Fake & Unwanted Promises: కొంద‌రు ప్రేమికులు ఇదే మంచి స‌మ‌యం అని త‌మ‌కు తోచింది చెబుతారు. ఆ స‌మ‌యంలో అనిపించిన వాగ్దానాలు చేస్తారు. ఇది మంచిది కాదు. త‌మ ల‌వ‌ర్‌ని ఇంప్రెస్ చేయ‌డానికి అన‌వ‌స‌ర‌పు, న‌మ్మ‌శ‌క్యం కాని వాగ్దానాలు చేస్తారు. చేయ‌డం వ‌ర‌కు ఓకే కానీ త‌ర్వాత నెర‌వేర్చ‌క పోతేనే ఇబ్బందులు ఎదుర‌వుతాయి. కొన్ని సార్లు... మీ బంధానికి బీట‌లు కూడా పారొచ్చు. కాబ‌ట్టి మీరు చేయ‌గ‌లిగే వాటిని చెప్పడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details