తెలంగాణ

telangana

డీఏవీ పాఠశాల ఘటన.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా

By

Published : Oct 26, 2022, 2:29 PM IST

Updated : Oct 26, 2022, 3:12 PM IST

Banjarahills DAV School Issue latest update: బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట పలు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Banjarahills DAV School latest update
Banjarahills DAV School latest update

Banjarahills DAV School Issue latest update: బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో జరిగిన చిన్నారి అత్యాచార ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట వామపక్ష, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరారు.

మరోవైపు పాఠశాల గుర్తింపు రద్దు చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేనను కలిసేందుకు వచ్చారు. విద్యా సంవత్సరం మధ్యలో గుర్తింపు రద్దు చేస్తే.. తమ పిల్లలు తీవ్ర ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. బడి మూసి వేయొద్దంటూ సంతకాల సేకరణ చేసి.. పాఠశాల కమిషనర్‌కు సమర్పించడానికి తీసుకొచ్చారు.

డీఏవీ పాఠశాల ఘటన.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా
Last Updated :Oct 26, 2022, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details