ETV Bharat / state

'స్కూల్ రద్దు చేయకండి.. ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తే చాలు'

author img

By

Published : Oct 22, 2022, 11:06 AM IST

Updated : Oct 22, 2022, 11:35 AM IST

DAV School in Banjara Hills
DAV School in Banjara Hills

11:04 October 22

బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

Concern parents of students of DAV school: బంజారాహిల్స్​లోని డీఏవీ పాఠశాలలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందులో చదువుతున్న 700మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఒక్కో తరగతి 50మంది విద్యార్థుల వరకు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం కొన్ని అవకాశాలను కల్పించింది. విద్యార్థులను సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పించడమా లేకపోతే.. కట్టిన ఫీజును వెనక్కి తిరిగి ఇచ్చేస్తే తల్లిదండ్రులు తమకు ఇష్టమున్న పాఠశాలల్లో చేర్పించుకోవడమా అనే ఆప్షన్లు ఇచ్చారు.

మరికొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులైతే విద్యాశాఖాధికారులకు ఫోన్లు చేసి పాఠశాలను అదే విధంగా కొనసాగించి.. ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వీటన్నింటిని విద్యాశాఖాధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రజినీ కుమార్ నేర చరిత్ర గురించి పోలీసులు వివరాలు సేకరించారు. రజినీ కుమార్ మరికొంతమంది విద్యార్థినిలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రజినీ కుమార్ మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. కుమారుడు, కుమార్తె ఉన్నారు.

11ఏళ్లుగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ మాధవి దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తున్న రజినీ కుమార్ ఇతర ఉపాధ్యాయుల వద్ద అజమాయిషీ ప్రదర్శించేవాడని పోలీసులు గుర్తించారు. ప్రిన్సిపల్ వద్ద ఉండే వ్యక్తి కావడంతో ఇతర ఉపాధ్యాయులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారు. దీన్ని అదునుగా తీసుకొని చిన్నారుల తరగతి గదుల్లోకి వెళ్లడం.. పిల్లల్ని డిజిటల్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడు. ఈ క్రమంలోనే 4ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రజినీ కుమార్​పై నల్గొండ జిల్లాలో వరకట్న వేదింపులకు సంబంధించిన కేసు ఉన్నట్లు తేలింది. నిందితుడు రజినీ కుమార్, ఇంఛార్జ్ ప్రిన్సిపల్ మాధవిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: పసికూనలపై పైశాచిక చేష్టలు.. బంజారాహిల్స్ ఘటనలో విస్తుపోయే నిజాలు

'బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు'

చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్​ డ్రైవర్​ను చితక్కొట్టిన తల్లిదండ్రులు

'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం

Last Updated : Oct 22, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.