తెలంగాణ

telangana

Telangana Covid Cases: రాష్ట్రంలో కొత్తగా 592 కరోనా కేసులు

By

Published : Jul 7, 2022, 10:36 PM IST

Telangana Covid Cases: రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో 27,488 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 592 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 477 మంది కోలుకున్నారు.

కరోనా
కరోనా

Telangana Covid Cases: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,488 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 592 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొవిడ్‌ బారి నుంచి 477 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,997 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రికవరీ రేటు 98.87శాతంగా ఉందని పేర్కొన్నారు. తాజాగా వచ్చిన కొవిడ్‌ కేసులలో హైదరాబాద్‌లో 331, రంగారెడ్డి 60, ఖమ్మం 17, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 45, హనుమకొండ 10, భువనగిరి 9, కరీంనగర్‌ 9, నల్గొండ జిల్లాలో 11 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details