తెలంగాణ

telangana

Telangana Corona Cases: రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

By

Published : Feb 6, 2022, 9:33 PM IST

Telangana Corona Cases: తెలంగాణలో కొవిడ్​ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,217 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బారిన పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Telangana Corona Cases: రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
Telangana Corona Cases: రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 48,434 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,77,530కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,100కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 3,944 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,498 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 383 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details