తెలంగాణ

telangana

రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

By

Published : Nov 11, 2020, 6:55 AM IST

రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురువారం ఒకటి రెండు చోట్ల సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

cool weather in telangana comming todays
రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణాగ్రతలు

తెలంగాణలో బుధ, గురువారం ఒకటి రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులు పొడి వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

చలి నుంచి తట్టుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పుతో జలుబు, జ్వరం వచ్చే అవకాశం ఉందన్నారు. తెల్లవారుజామున, రాత్రి బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్‌

ABOUT THE AUTHOR

...view details