తెలంగాణ

telangana

CLP ON ASSEMBLY SESSION: 'ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి.. ఆ అంశాలను చర్చకు తేవాలి'

By

Published : Sep 24, 2021, 12:15 PM IST

BHATTI ON ASSEMBLY SESSION
భట్టి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని, ద‌ళిత బంధుపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ప్ర‌జా సమస్యలపై ప్రభుత్వంతో గట్టిగా పోరాడాలని సీఎల్పీ నిర్ణయించింది. కాంగ్రెస్​ సభాపక్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క అధ్య‌క్ష‌త‌న కొన‌సాగిన‌ సీఎల్పీ స‌మావేశంలో ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ‌గ్గారెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, సీత‌క్క‌ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చ జ‌రిగింది.

ప్రజా స‌మ‌స్య‌లపై చ‌ర్చించాల్సి ఉన్నందున వీలైన‌న్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌పాల‌ని బీఏసీలో డిమాండ్ చేయాల‌ని నేతలు నిర్ణ‌యించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌ని బీఏసీలో కోరాల‌ని పేర్కొన్నారు. ద‌ళిత బంధు, ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌, పోడుభూములు, ధ‌ర‌ణి పోర్ట‌ల్ స‌మ‌స్య త‌దిత‌ర వాటిపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఇదీ చదవండి:Bjp Telangana mlas : 'ప్రజల వినతులపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం'

Ts Assembly Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details