తెలంగాణ

telangana

కేసీఆర్ నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారు: జీవన్ రెడ్డి

By

Published : Nov 19, 2020, 10:11 AM IST

నియంత్రిత సాగు పేరుతో ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి వ్యాఖ్యానించారు. సన్నాలు సాగు చేసిన రైతులకు పదివేల రూపాయల దిగుబడి తగ్గిందని... ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

congress mlc jeevan reddy serious on telangana government
కేసీఆర్ నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారు: జీవన్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆగమవుతున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నియంత్రిత సాగు పేరుతో సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారు: జీవన్ రెడ్డి

కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాలు సాగుచేసిన రైతులకు మూడు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నాలు సాగు చేసిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల విలువైన దిగుబడి తగ్గిందని... వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం రైతులకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:సన్న రకానికి మద్ధతు ధర ఇవ్వాలి: రైతులు

ABOUT THE AUTHOR

...view details