ETV Bharat / state

సన్న రకానికి మద్ధతు ధర ఇవ్వాలి: రైతులు

author img

By

Published : Nov 5, 2020, 5:49 PM IST

సన్నరకం వరిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే నాణ్యతలేదంటూ అధికారులు వెనక్కి పంపిస్తున్నారని కరీంనగర్​ జిల్లా గంగాధరలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్ధతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

farmers protest at gangadhara in karimnagar district
సన్న రకానికి మద్ధతు ధర ఇవ్వాలి: రైతులు

సన్నరకం వరిధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధరలో రైతుల ధర్నా చేశారు. కరీంనగర్​-జగిత్యాల రహదారిపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. దానితో రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యత లేదంటూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు. సత్వరం ధాన్యం కొనుగోలు మొదలుపెట్టాలని నినాదాలు చేశారు. నాణ్యత లేదని ధాన్యం లెక్కింపులో కోత విధిస్తున్నారని ఆవేదన చెందారు. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని రాస్తారోకో చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళనను విరమించారు.

ఇదీ చూడండి: ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. దళారులను నమ్మొద్దు: పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.