తెలంగాణ

telangana

Revanth Reddy Latest News : 'బీఆర్​ఎస్​, బీజేపీ రెండూ ఒక్కటే.. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి'

By

Published : Jul 6, 2023, 4:02 PM IST

Congress Booth Level Management Program : రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12 వేల ఓట్లను తొలగించారన్నారు. ఒక్కో కుటుంబానికి 5 ఓట్లు ఉంటే.. 2 ఓట్లు డిలీట్ చేశారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఇందిరా భవన్‌లో బూత్ లెవెల్ మేనేజ్​మెంట్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎన్నికలకు కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.

Revanth Reddy
Revanth Reddy

Congress Booth Level Management Program at Hyderabad : హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఎల్‌డీఎం బూత్ లెవెల్ మేనేజ్​మెంట్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్​, సంపత్ కుమార్, జాతీయ నాయకులు శశికాంత్ సింథిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్, హర్కర వేణుగోపాల్, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ఇందులో ప్రధానంగా బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. దీనిని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఓటరు జాబితాలో అవకతవకలు..: పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని తెలిపారు. యాక్టివ్‌గా ఉన్న బూత్ ఎన్​రోలర్స్‌ను బీఎల్ఏలుగా నియమించుకోవాలన్న ఆయన.. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12 వేల ఓట్లను తొలగించారన్నారు. ఒక్కో కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లు డిలీట్ చేశారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

Telangana Assembly Elections 2023 : బీజేపీ, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దని.. ప్రతీక్షణం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధీ భవన్ నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ఈ నెల 15వ తేదీ లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్‌లో జులై 18న ట్రైనింగ్ ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరు 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేసి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందకు పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

"బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎన్నికలకు కుయుక్తులు పన్నుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయి. కాంగ్రెస్‌ సానుభూతిపరుల ఓట్లు తొలగించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదు. ప్రతి క్షణం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి". - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details