తెలంగాణ

telangana

kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్

By

Published : Jun 21, 2021, 12:22 PM IST

ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని అన్నారు. అన్ని వర్గాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు.

cm kcr, acharya jayashankar
సీఎం కేసీఆర్, ఆచార్య జయశంకర్

ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. రాష్ట్ర స్వయం పాలన స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్... తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని సీఎం కొనియాడారు. ఆయన ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతోందని... ఆయన ఆలోచనలకు అనుగుణంగానే అన్ని వర్గాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయని అన్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఆయనకు ఘననివాళి అర్పిస్తోందని సీఎం తెలిపారు.

ఇదీ చదవండి:వ్యాక్సినేషన్​ ప్రక్రియలో కీలక మార్పులు

ABOUT THE AUTHOR

...view details