తెలంగాణ

telangana

కైకాల పార్థీవదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్​

By

Published : Dec 23, 2022, 4:56 PM IST

Updated : Dec 23, 2022, 5:10 PM IST

CM KCR Pays Tribute to Kaikala : నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ భౌతిక కాయానికి సీఎం కేసీఆర్​ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కైకాల సత్యనారాయణ తన విలక్షణమైన నటనాశైలితో పేరు ప్రఖ్యాతలు సాధించారని కేసీఆర్​ కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్​ గుర్తు చేసుకున్నారు.

cm kcr
సీఎం కేసీఆర్​

CM KCR Pays Tribute to Kaikala : నటుడు కైకాల సత్యనారాయణ విలక్షణమైన నటనా శైలితో పేరు ప్రఖ్యాతలు సాధించారని సీఎం కేసీఆర్ అన్నారు. హీరోలకు దీటుగా రాణించారని కొనియాడారు. ఫిల్మ్ నగర్​లోని కైకాల సత్యనారాయణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్​లు ఉన్నారు.

ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణకు ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా పోషించేవారని, హీరోలకు దీటుగా రాణించారని సీఎం కేసీఆర్​ కొనియాడారు. సత్యనారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో అనేక అనుభవాలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి కూడా పని చేశానని సీఎం స్మరించుకున్నారు. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిదని, సత్యనారాయణకు సాటి ఎవరూ రారన్నారు.

"కైకాల సత్యనారాయణ తన విలక్షణమైన నటనాశైలితో ఎవరికీ సాధ్యం కాని పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా పోషించేవారు. హీరోలకు దీటుగా రాణించేవారు. కైకాల సత్యనారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో అనేక అనుభవాలను పంచుకున్నాను." -కేసీఆర్​, ముఖ్యమంత్రి

కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్​

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details