తెలంగాణ

telangana

మాజీ మంత్రిని కలిసిన సీఎం కేసీఆర్​

By

Published : May 28, 2020, 7:38 PM IST

మాజీ మంత్రి విజయరామరావును బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎం కేసీఆర్‌ కలిశారు. ఆయన సతీమణి ఇటీవల మరణించిన సందర్భంగా ఆయనను, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

CM KCR met former tdp minister at banjara hills hyderabad
తెదేపా మాజీ మంత్రిని కలిసిన సీఎం కేసీఆర్​

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామరావును బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారు. విజయరామరావు సతీమణి ఇటీవలే మరణించింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ సాయంత్రం స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు 20 నిమిషాల పాటు విజయరామరావు నివాసంలో గడిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయరామరావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా నివాళులు అర్పించారు.

తెదేపా మాజీ మంత్రిని కలిసిన సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి :రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details