తెలంగాణ

telangana

CM KCR Inaugurates 9 Medical Colleges : 'వైద్యవిద్యలో నవశకం.. ఒకేరోజు 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం'

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 12:28 PM IST

Updated : Sep 15, 2023, 7:33 PM IST

CM KCR Inaugurates 9 Medical Colleges
CM KCR

12:25 September 15

CM KCR Inaugurates 9 Medical Colleges : ఒకేసారి 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం: కేసీఆర్‌

Medical Colleges 9 వైద్య కాలేజీలు ప్రారంభించిన కేసీఆర్​

CM KCR Inaugurates 9 Medical Colleges Telangana : తెలంగాణ వైద్యవిద్యా రంగంలో నవశకం మొదలైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకేసారి 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తొమ్మిది వైద్య కళాశాలలను ఇవాళ వర్చువల్ వేదికగా కేసీఆర్ ప్రారంభించారు. ఇటీవలే ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 26 మెడికల్ కళాశాలలను ప్రారంభించుకున్నామని కేసీఆర్ తెలిపారు. రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించబోతుందని చెప్పారు.

KTR on 9 Medical Colleges Opening : 'నూతన మెడికల్ కాలేజీల ప్రారంభంతో వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి'

9 Medical Colleges opening in Telangana Today :దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్‌ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు(10 Thousand Super Specialty Beds in Telangana) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నామని వివరించారు. గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించామని.. అలాగే మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

'ఒకేసారి 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం. జిల్లాకు ఒక మెడికల్‌ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం. తెలంగాణ ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించబోతుంది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్‌ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.' -కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

Harish Rao on 9 Medical Colleges Opening : రాష్ట్రంలో ఒకేసారి 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే మెుదటిసారి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. కేసీఆర్‌ దార్శనికత వల్లే ఒకేసారి 9 కళాశాలలు ప్రారంభించగలిగామని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందని మంత్రి వివరించారు.

9 Medical Colleges Inauguration in Telangana : నేడు 9 మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Telangana Medical Colleges Increase : 'రాష్ట్రంలో పెరిగిన మెడికల్​ కళాశాలలు.. స్వరాష్ట్రంలోనే వైద్యవిద్యను పూర్తి చేయవచ్చు'

Last Updated : Sep 15, 2023, 7:33 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details