తెలంగాణ

telangana

మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఎన్నిక.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు

By

Published : Feb 12, 2023, 1:26 PM IST

Updated : Feb 12, 2023, 1:45 PM IST

CM Kcr on Council Deputy Chairman Election: శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ పదవీ కాలం ఫలప్రదం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. బండ ప్రకాశ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని కేసీఆర్‌ కొనియాడారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాశ్​కు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

CM Kcr
CM Kcr

CM Kcr on Council Deputy Chairman Election: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​గా బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ పదవీకాలం ఫలప్రదం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. విద్యార్థి స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆయన సేవలు చాలా అవసరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఉన్నత విద్యావంతుడిగా వరంగల్‌ జిల్లా వాసిగా సుపరిచితులని.. ముదిరాజ్ సామాజిక అభ్యున్నతికి బండ ప్రకాశ్​ చేసిన కృషి అభినందనీయమన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా బండ ప్రకాష్ కీలకపాత్ర పోషించడంతోపాటు నూతన రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బండ ప్రకాశ్​కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ స్వయంగా బండప్రకాశ్‌ను తీసుకుని వెళ్లి.. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ కుర్చిలో కూర్చోబెట్టారు.

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాశ్​కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జీవన్ రెడ్డి తదితరులు అభినందించారు. సభ్యులందరికీ చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ.. ముందుకెళ్లాలని బండప్రకాశ్‌ను సభ్యులు కోరారు.

'ఎంపీగా ఉన్న బండ ప్రకాశ్‌ను రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించాం. తెలంగాణ ఉద్యమంలో బండ ప్రకాశ్‌ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రజలకు మీ సేవలు చాలా అవసరం. బండ ప్రకాశ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ముదిరాజ్ సామాజిక వర్గానికి బండ ప్రకాశ్‌ కృషి చేశారు.'-సీఎం కేసీఆర్‌

ఈ ఎన్నికకు ముందు శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. జీఎస్టీ పరిహారం, ఆర్టీసీచే హైస్పీడ్ డీజిల్ వినియోగం, భవన క్రమబద్దీకరణ, గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్ల నియామకం, దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, జంట నగరాల్లో మెట్రో రైల్ విస్తరణ, పురావస్తు సంపద పరిరక్షణ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ అంశాలు కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చాయి. అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులతో పాటు 2022-23 బడ్జెట్ అదనపు అంచనాలపైనా మండలిలో చర్చ జరగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details