తెలంగాణ

telangana

రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ క్రిస్మస్​ వేడుకలు - ఆ రూట్లలో ట్రాఫిక్​ ఆంక్షలు

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 12:47 PM IST

Christmas Celebrations 2023 at LB Stadium Today 2023 : హైదరాబాద్ నగరంలోని ఎల్బీస్టేడియంలో ఇవాళ సాయంత్రం క్రిస్మస్​ వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొననున్న దృష్ట్యా ట్రాఫిక్​ పోలీసులు నగరంలో పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు.

Christmas celebrations under the auspices of the State Govt
Christmas Celebrations 2023 at LB Stadium

Christmas Celebrations 2023 at LB Stadium Today 2023 : హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్​ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్​ పోలీసులు ఆంక్షలు విధించారు.

Traffic Diversions in Hyderabad Today : ఏఆర్​ పెట్రోల్​ బంక్​ కూడలి నుంచి బషీర్​బాగ్​ బీజేఆర్​ విగ్రహం కూడలి వైపు వెళ్లవలసిన వాహనాలను నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. అబిడ్స్​, గన్​ఫౌండ్రిల వైపు నుంచి వచ్చే వాహనదారులకు బషీర్​బాగ్​ బీజేఆర్​ విగ్రహం కూడలి వైపు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. గన్‌ఫౌండ్రిలోని ఎస్బీఐ నుంచి సుజాత స్కూల్‌, చాపెల్‌ రోడ్డు వైపు పంపించనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌ బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ కూడలి వైపు వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్‌ నుంచి అవసరాన్ని బట్టి హిమాయత్‌ నగర్‌ వైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణలతో చర్చిలను సుందరంగా ముస్తాబు చేశారు. పండుగ సందర్భంగా మెదక్‌లో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మత గురువులతో కలిసి గురువారం నిరుపేద క్రైస్తవులకు బహుమతులు పంపిణీ చేశారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కానుకలు అందజేశారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఏసు క్రీస్తు ఊరేగింపు ఘనంగా జరిపారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని బొగ్గులకుంటలో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా సాగాయి. అనాథ పిల్లలకు బహుమతులు అందజేశారు. యేసు క్రీస్తు జన్మ కథను జీవితంలోకి తెచ్చే నాటకంతో పాటు, చిన్నారుల ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

క్రిస్మస్​ వేడుకలకు సిద్ధమైన మెదక్​ చర్చి.. ఒకసారి చరిత్ర చూద్దామా?

రాష్ట్రపతి నిలయం వద్ద : సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సాయంత్రం 'ఎట్​ హోమ్' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లోతుకుంట టి.జంక్షన్‌, ఎంసీఈఎంఈ సిగ్నల్‌, లాల్‌ బజార్‌ టి.జంక్షన్‌, తిరుమలగిరి ఎక్స్‌ రోడ్స్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌ ఇన్‌ గేట్‌, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్​రోడ్స్‌, సీటీవో, ఎస్బీఐ జంక్షన్‌, రసూల్‌పురా, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌ ల్యాండ్‌, మోనప్ప కూడలి, ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం జంక్షన్‌ వద్ద, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్‌ భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టుల వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపి వేయనున్నట్లు స్పష్టం చేశారు.

35 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తుతో క్రిస్మస్ స్టార్.. ఎక్కడంటే?

1500 కిలోల టమాటాలతో భారీ శాంతాక్లాజ్

ABOUT THE AUTHOR

...view details