తెలంగాణ

telangana

"త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది.. గెలుస్తుంది"

By

Published : Oct 22, 2022, 12:31 PM IST

Updated : Oct 22, 2022, 2:01 PM IST

Chandrababu on Amaravati: అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైకాపా కుతంత్రాలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామన్నారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన జగన్‌... అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది..అమరావతే గెలుస్తుంది...ఇదే ఫైనల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

BABAU
BABAU

Chandrababu on Amaravati: అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైకాపా కుతంత్రాలు సాగవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని ఆయన గుర్తుచేశారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామన్న ఆయన... పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యిందని మండిపడ్డారు.

అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పమని, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి... అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని ఆయన స్పష్టంచేశారు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆకాంక్షించారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది అన్నారు, ఇదే ఫైనల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

"ఏడేళ్ల క్రితం ఇదేరోజు ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా నిలుస్తుందని ఆకాంక్షించాం. పాలకుల వ్యతిరేక ఆలోచనల కారణంగా అంతా నాశనమైంది. అమరావతి అంటే 28 వేలమంది రైతుల త్యాగం, కోట్లమంది సంకల్పం. ప్రాంతాలకు అతీతంగా అమరావతిని గర్వకారణంగా భావించారు. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారు. రైతుల మహాపాదయాత్రపై వైకాపా కుతంత్రాలు సాగవు. ఆంధ్రుల రాజధాని అమరావతే. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. అమరావతే నిలుస్తుంది.. గెలుస్తుంది.. ఇదే ఫైనల్." -చంద్రబాబు

Last Updated :Oct 22, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details