తెలంగాణ

telangana

Kishan Reddy: 'ప్రజలు అపోహలు వీడాలి... వ్యాక్సిన్​ వేయించుకునేందుకు రావాలి'

By

Published : Aug 23, 2021, 12:05 PM IST

కేంద్ర కేబినెట్​ మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి మొదటిసారిగా గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను, ఆక్సిజన్ ప్లాంట్ పనితీరుపై అధికారులను ఆరా తీశారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

Kishan Reddy
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గాంధీ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించిన కిషన్ రెడ్డి... ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కిషన్​ రెడ్డిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు సన్మానించారు.

"ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో పది సార్లు పర్యటించా. సెకండ్​ వేవ్​లో ఆక్సిజన్ కొరత బాగా వెంటాడింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా సిద్ధం చేసుకున్నాం. పీఎం కేర్ కింద దేశంలో 1,222 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అందులో 8 ఆక్సిజన్ యూనిట్లు గాంధీలో అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో మరో 6 ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 41 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రానికి ఇప్పటివరకు 1,68,61,809 వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13.18 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తాం. అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవు.''

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మహా యజ్ఞంలా సాగుతోందని... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ పట్ల ప్రజలు అపోహలు వీడాలని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కిషన్ సూచించారు.

ఇదీ చూడండి:Vaccination: జంటనగరాల్లో నేటి నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్​​..

ABOUT THE AUTHOR

...view details