తెలంగాణ

telangana

ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్​.. పార్టీ కార్యాలయాల్లో శ్రేణుల సంబురాలు

By

Published : Dec 8, 2022, 7:01 PM IST

Gujarat and Himachal Pradesh Elections 2022: గుజరాత్, హిమచల్ ప్రదేశ్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో ఆపార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ.. డీజే పాటలతో హోరెత్తించారు.

celebrations in Telangana
celebrations in Telangana

Gujarat and Himachal Pradesh Elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో కాషాయ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మొత్తం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గాను ఇప్పటికే బీజేపీ మేజిక్ ఫిగర్​ దాటి 156 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఘనవిజయంతో రాష్ట్రంలో ఆ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు తినిపించుకుంటు సంబరాలు చేసుకున్నారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో నేతలు డీజే పాటలు పెట్టి, బాణసంచా కాల్చుతూ ఉత్సాహంగా గడిపారు.

బీజేపీ సంబరాల్లో అపశ్రుతి:సంబురాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కార్యకర్తలు బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు పడి కార్యాలయం వద్ద ఖాళీ స్థలంలో మంటలు చెలరేగాయి. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, విద్యుత్‌ తీగలు దగ్ధం కావడంతో కార్యకర్తలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

మంచు కొండల్లో హస్తం జయకేతనం:అటుహిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘన విజయం విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్​ నేతలు గాంధీ భవన్​ వద్ద సంబరాలు చేసుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ట్విట్టర్ వేదికగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్​.. పార్టీ కార్యాలయాల్లో శ్రేణుల సంబురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details